English | Telugu

గోపి శ్రీవాస్ ముహూర్తం మొదలు

"లక్ష్యం" వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత గోపీచంద్, శ్రీవాస్ ల కాంబినేషన్ లో మరో కొత్త చిత్రం తెరకెక్కబోతుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు నేడు హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో గోపీచంద్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. ఒక పక్క కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథను దర్శకుడు శ్రీవాస్ సిద్ధం చేసాడని తెలిసింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సంగీత చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.