English | Telugu
ఘాజీ దర్శకుడితో గోపీచంద్.. ఈసారి గురి తప్పదు!
Updated : Mar 10, 2025
'ఘాజీ' వంటి వైవిద్యభరితమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సంకల్ప్ రెడ్డి.. మొదటి సినిమాతోనే టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. రెండవ సినిమా 'అంతరిక్షం' తోనూ సత్తా చాటాడు. అనంతరం బాలీవుడ్ కి వెళ్ళి 'IB71' మూవీతో అక్కడా మంచి మార్కులే కొట్టేశాడు. కానీ, 2017 లో దర్శకుడిగా పరిచయమైన సంకల్ప్ రెడ్డి.. ఎనిమిదేళ్లలో తెలుగులో రెండే సినిమాలు చేశాడు. సంకల్ప్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఎక్కువ సినిమాలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం సినీ ప్రియుల్లో ఉంది. అయితే ఎట్టకేలకు సంకల్ప్.. తెలుగులో తన మూడవ సినిమాని ప్రకటించాడు. (Sankalp Reddy)
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోలలో గోపీచంద్ ఒకరు. కానీ, కొన్నేళ్లుగా ఆయనను వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. సాలిడ్ కమ్ బ్యాక్ కోసం గోపీచంద్ ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో దర్శకుడు సంకల్ప్ రెడ్డితో గోపీచంద్ చేతులు కలపడం విశేషం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనున్నారు. గోపీచంద్ కెరీర్ లో 33వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇది భారీ బడ్జెట్ తో రూపొందనున్న హిస్టారికల్ ఫిల్మ్ అని తెలుస్తోంది. మరి ఈ చిత్రంతో గోపీచంద్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి. (Gopichand)
గోపీచంద్-సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా ప్రకటన రావడంతో గోపీచంద్ అభిమానులు సంబరపడుతున్నారు. ఈసారి గురి తప్పదని, గోపీచంద్ ఘన విజయం సాధిస్తాడని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
