English | Telugu

గోపీచంద్ 'బాణం' మళ్ళీ గురి తప్పింది!

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోలలో గోపీచంద్ ఒకరు. మంచి కటౌట్, దానికి తగ్గట్లే మంచి పర్ఫామెన్స్ ఆయన సొంతం. కెరీర్ స్టార్టింగ్ లో పవర్ ఫుల్ విలన్ రోల్స్ పోషించి మెప్పించిన గోపీచంద్.. ఆ తర్వాత హీరోగా పలు కమర్షియల్ హిట్స్ అందుకున్నాడు. హీరోగా 2004 నుంచి 2008 వరకు 'యజ్ఞం', 'ఆంధ్రుడు', 'రణం', 'లక్ష్యం', 'శౌర్యం' ఇలా ఏడాదికి కనీసం ఓ మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆ తర్వాత నుంచి విజయాల కంటే పరాజయాలే ఆయనను ఎక్కువగా పలకరించాయి. 2014 లో 'లౌక్యం'తో అదిరిపోయే హిట్ అందుకొని, సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టు కనిపించినా.. ఆ తర్వాత మళ్ళీ అదే తడబాటు కొనసాగుతోంది. ఆయన సరైన హిట్ అందుకొని దాదాపు తొమ్మిదేళ్లు అవుతుంది. మధ్యలో 'గౌతమ్ నంద', 'సీటిమార్' వంటి సినిమాలు పరవాలేదు అనిపించుకున్నా.. ఆశించిన విజయాన్ని మాత్రం అందించలేకపోయాయి. ఇక తాజాగా ఎన్నో అంచనాలు పెట్టుకున్న 'రామబాణం' కూడా దారుణంగా నిరాశపరిచింది.

గతేడాది మారుతి దర్శకత్వంలో రూపొందిన 'పక్కా కమర్షియల్' చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు గోపీచంద్. ఈ సినిమాపై గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ప్రచార చిత్రాలు చూసి, ఈ చిత్రం గోపీచంద్ కి మంచి కమర్షియల్ సక్సెస్ ని అందించడం ఖాయమని భావించారంతా. కానీ తీరా విడుదలయ్యాక సినిమా ఏమాత్రం అలరించలేక.. ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఇప్పుడు 'రామబాణం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు గోపీచంద్. తనకు లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్లను అందించిన శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన హ్యాట్రిక్ ఫిల్మ్ కావడంతో దీనిపై కూడా గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ మొదటి షో నుంచే ఈ మూవీ నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. రొటీన్ కథను తీసుకొని, మరింత రొటీన్ గా తెరకెక్కించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే గోపీచంద్-శ్రీవాస్ ల హ్యాట్రిక్ హిట్ కు బ్రేక్ పడిందన్నమాట. దాంతో హిట్ కోసం గోపీచంద్ మళ్ళీ వేట కొనసాగించాల్సిందే. అన్ని ఉన్నా.. కథల ఎంపిక మరియు ఇతర కారణాల వల్ల గోపీచంద్ విజయాలు అందుకోవడంలో వెనకపడిపోతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ కన్నడ డైరెక్టర్ హర్షతో ఓ సినిమా చేస్తున్నాడు. మరి ఆ సినిమాతోనైనా హిట్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.