English | Telugu
'గోపాల గోపాల' రిలీజ్ 10న పక్కా
Updated : Jan 8, 2015
పవన్ కల్యాణ్, వెంకటేష్‌ల క్రేజీ మల్టీస్టారర్ సినిమా 'గోపాల గోపాల' జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. 9కి రావాల్సిన ఈ చిత్రం 10కి వాయిదా పడింది. ఈ ఆలస్యానికి కారణం సెన్సార్ బోర్డు సభ్యులేనట. బుధవారం సెన్సార్ పూర్తి చేసుకోవాల్సిన ఈ సినిమా, సెన్సార్ బోర్డు అధికారి సెలవుల్లో వుండడంతో వాయిదా పడింది. ప్రస్తుతం సెన్సార్ అధికారులు 'గోపాల గోపాల'ను చూస్తున్నట్లు సమాచారం. దీంతో నిర్మాతలు జనవరి 10న ‘గోపాల గోపాల' చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.విడుదల తేదీ ఖరారు కావడంతో ‘గోపాల గోపాల' మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. అమెరికాలో ప్రీమియర్ షోలు భారీ సంఖ్యలో వేస్తున్నారు. యూఎస్ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 100కుపైగా స్క్రీన్లలో విడుదలవుతోంది.'గోపాల గోపాల' చిత్రానికి కిషోర్ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో పోసాని పాత్ర హైలెట్ అవుతుందని ఇన్ సైడ్ టాక్.