English | Telugu
బాబోయ్ శంకర్ 'ఐ' మళ్ళీ వాయిదా
Updated : Jan 8, 2015
ఇండియన్ సినిమా ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్. విక్రమ్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ ‘ఐ’ మరోసారి వాయిదా పడే అవకాశం వున్నట్లు సమాచారం. ఫైనాన్షియల్ ప్రాబ్లెంమ్స్ వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతకు, ఫైనాన్షియర్ మధ్య ఆర్ధిక లావాదేవిల్లో వివాదం రావడంతో, ఫైనాన్షియర్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఈ కేసును పరిశీలించిన న్యాయమూర్తి ‘ఐ’ సినిమా విడుదలను వాయిదా వేయాల్సిందిగా ఆదేశించారు. ఈనెల 30 తర్వాత విడుదల విషయాన్ని ఆలోచించాలని సూచించారు. దీంతో యూనిట్ సభ్యులు ప్రస్తుతం టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. మరోవైపు నిర్మాత, ఫైనాన్షియర్ మధ్య చర్చలు మాత్రం కొనసాగుతున్నాయి. వారిద్దరి మధ్య అవగాహన కుదిరితే ఈ సినిమా యథావిధిగా జనవరి 14వ ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం వుంది.