English | Telugu

ఇవి చెత్త సినిమాలట

సినిమా..మూడు గంటల పాటు ప్రేక్షకుడికి వినోదాన్ని అందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. హాస్యం, ధ్రిల్లర్, సస్పెన్స్ ఇలా విభిన్న రకాలుగా సినిమాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. దర్శకుల ప్రతిభ, నటీనటుల నటనా కౌశలం వీటి ఆధారంగా వారికి సముచిత గౌరవాన్ని అందించే లక్ష్యంతో సినీ పరిశ్రమలో గొప్ప గొప్ప అవార్డులంటూ చాలానే ఉన్నాయి. హాలీవుడ్‌లో ఆస్కార్, ఇండియాలో ఫిలింఫేర్ నుంచి నంది అవార్డ్ దాకా..ఆ మాట కొస్తే రకరకాల స్వచ్చంద సంస్థలు, చిన్నా చితకా సంస్థలు అందించే అవార్డులు లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటన కేటగిరీ అవార్డులు. వీటికి భిన్నంగా సినిమా కలెక్షన్ల గురించ తప్ప, క్వాలిటీ గురించి ఆలోచించని దర్శక,నిర్మాతలు నటీనటుల్నీ చైతన్యవంతుల్ని చేసే దిశగా "గోల్డెన్ కేలా " పేరుతో బాలీవుడ్‌లో చెత్త అవార్డుల్ని ప్రకటిస్తున్నారు.

8వ గోల్డెన్ కేలా అవార్డుల ఫంక్షన్ ముంబైలో అట్టహాసంగా జరిగింది. షారూఖ్ ఖాన్, కాజోల్ నటించిన దిల్‌వాలే 2015 సంవత్సరానికి గానూ ఉత్తమ చెత్త చిత్రంగా ఎంపికైంది. భారీ స్టార్ కాస్టింగ్, పబ్లిసిటీ స్టంట్లు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించినా ప్రేక్షకులు మాత్రం దీనిని చెత్త చిత్రంగా తేల్చేసారు. చెత్త నటుడిగా 'సూరజ్ పాంచోలీ'ని ఎన్నుకున్నారు. ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాకి గానూ సోనమ్ కపూర్ ఉత్తమ చెత్త నటిగా, ఈ ఏడాది చెత్త పాటగా "ప్రేమ్ రతన్ ధన్ పాయో'' టైటిల్ సాంగ్ ఎంపికైంది. చెత్త దర్శకుడిగా సూరజ్ బర్ జాత్యా ఎంపికయ్యారు. బాలీవుడ్‌లో సరే కానీ టాలీవుడ్ పరిస్థితి ఏంటీ?. ఇక్కడ కూడా కేవలం కలెక్షన్లపై పెట్టిన ద‌ృష్టి సినిమా క్వాలీటి, కంటెంట్ విషయంలో దర్శక, నిర్మాతలు పెట్టడం లేదు. అందుకే తెలుగులో ఉత్తమ చెత్త చిత్రం, ఉత్తమ చెత్త నటుడు, ఉత్తమ చెత్త నటి, ఉత్తమ చెత్త దర్శకుడు విభాగాల్లో మీరు ఎవరికి అవార్డులు ఇస్తారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.