English | Telugu
హృతిక్ రోషన్ ఆఫీసులో అగ్నిప్రమాదం
Updated : Jul 18, 2014
ముంబాయిలోని రితిక్ రోషన్ ఆఫీసులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముంబాయి, లోకండ్ వాలా లింక్ రోడ్ లో గల లోటస్ బిజినెస్ పార్క్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుంది. 21 అంతస్తులో చెలరేగిన మంటలు వెనువెంటనే 20 అంతస్తుకి వ్యాపించాయి. ఈ భవన సముదాయంలో బాలీవుడ్ తారలు అనేక మంది బిజినెస్ కార్యాలయాలు కలవు. రితిక్ రోషన్, అజయ్ దేవగన్ తో పాటు మరికొంత మంది ప్రముఖుల ఆఫీసుల గల ఈ భవనాన్ని వెంటనే ఖాళీ చేయించారు.
ప్రమాద విషయం తెలియగానే 12 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు హెలికాప్టర్ ని వినియోగించారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ఈ సంఘటలో ఒకరు మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.