English | Telugu

A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ కి థాంక్స్ చెప్పిన EVOL మూవీ దర్శక, నిర్మాత రామ్ యోగి వెలగపూడి!

ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే నెత్తిన పెట్టేసుకుంటున్నారు. అందుకే దర్శకనిర్మాతలు కూడా కొత్తదనం ఉండేలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే ఒక ఆసక్తికరమైన సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించిన సినిమా EVOL. 'LOVE' ని రివర్స్ లో చూస్తే 'EVOL' అని ఈ సినిమా కూడా ఒక రివర్స్ లవ్ స్టోరీగా మన ముందుకు రాబోతుందని వెల్లడించారు ప్రొడ్యూసర్ – డైరెక్టర్ రామ్ యోగి వెలగపూడి. రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది.

ఎవోల్ EVOL. (a love story in reverse ) డిఫరెంట్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా వివరాలను శుక్రవారం ప్రసాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన పత్రిక సమావేశంలో దర్శక నిర్మాత రామ్‌ యోగి వెలగపూడి పాల్గొని మాట్లాడుతూ.. తేడా బ్యాచ్‌ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్‌ ల్యాబ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందన్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య అండర్‌స్టాండింగ్‌, నేపథ్యంలో సాగే కథ అని, డిఫరెంట్‌ అంశాలు, వాణిజ్య విలువలతో క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిందని, ఆధ్యంతం ఉత్కంఠగా సాగుతుందని తెలిపారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌, వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపామని అన్నారు.

సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెనిఫర్ ఇమ్మానుయేల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా, విజయ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.