English | Telugu

నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్న శోభితా ధూళిపాళ్ల గురించి తెలుసా..?

ప్రస్తుతం శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) పేరు మారుమోగిపోతోంది. తాజాగా అక్కినేని వారసుడు నాగ చైతన్య (Naga Chaitanya)తో శోభిత నిశ్చితార్థం జరిగింది. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. శోభిత నటి అనే విషయం అందరికీ తెలుసు. అయితే అసలు శోభిత ఎవరు? ఆమె కుటుంబ నేపథ్యమేంటి? సినిమాల్లోకి ఎలా వచ్చింది? వంటి విషయాలు చాలా తక్కువ మందికి తెలుసు.

శోభిత అచ్చ తెలుగమ్మాయి. 1992, మే 31న ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో జన్మించింది. ఆమె తండ్రి వేణుగోపాల్ రావు నేవీ అధికారి కాగా, తల్లి శాంత కామాక్షి టీచర్. శోభిత విశాఖపట్నంలో పెరిగింది. లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్ లో చదివింది. పైచదువుల కోసం ముంబై వెళ్లిన ఆమె, ముంబై యూనివర్సిటీలోని హెచ్.ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ & ఎకనామిక్స్ లో చదివింది.

శోభితకు చిన్నప్పటి నుంచి కళలపై మక్కువ. సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి లలో శిక్షణ తీసుకుంది. అలాగే, నేవీ బాల్ పిన్ 2010లో నేవీ క్వీన్‌గా ఎంపికైంది. ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఆమె.. ఇండియాలోకి ప్రముఖ మోడల్స్ ఒకరిగా పేరు తెచ్చుకుంది. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలవడమే కాకుండా, మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ ను సొంతం చేసుకుంది. అలాగే, మిస్ ఎర్త్-2013 అందాల పోటీల్లో ఇండియా తరపున పాల్గొంది.

మోడల్ గా తనదైన ముద్రవేసిన శోభిత.. 2016లో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. విక్కీ విశాల్ హీరోగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన 'రామన్ రాఘవ్ 2.0'తో ఆమె నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 'చెఫ్', 'కళాకంది' అనే హిందీ చిత్రాల్లో నటించిన శోభిత.. అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హిందీ, తెలుగుతో పాటు మలయాళ, తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. పలు హిందీ వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది. 'మంకీ మ్యాన్' అనే ఇంగ్లీష్ చిత్రంలో కూడా శోభిత నటించడం విశేషం. మోడల్ గా, నటిగా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న శోభిత.. ఇప్పుడు అక్కినేని ఇంటికి కోడలిగా అడుగుపెడుతోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.