English | Telugu
ఫాహద్ ఫాజిల్ మా అంత పేరు తెచ్చుకోవాలి.. పుష్ప 2 నుంచి లుక్ రిలీజ్
Updated : Aug 8, 2024
అమితాబ్ బచ్చన్(amitabh bachchan)రజనీకాంత్(rajinikanth)ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మురిసిపోయే నటులు. అదే విధంగా ఆ ఇద్దరికి అభిమానులు ఉంటారు అనే స్టేజ్ నుంచి మూవీ లవర్స్ అందరు ఆ ఇద్దరి అభిమానులే అని చెప్పుకునే స్థాయికి ఎదిగారు.ఒకటి కాదు రెండు కాదు ఎన్నో దశాబ్దాలుగా సినీ కళామతల్లి ఒడిలో ఓలలాడుతూ తమ వర్సటైల్ నటనతో అలరిస్తూ వస్తున్నారు.లేటెస్ట్ గా ఆ ఇద్దరు ఫాహద్ ఫాజిల్(fahadh faasil)ని తమ అంత ఎదగమని ఆశీర్వదించారు.
ఫాహద్ ఫాజిల్.. సినిమా సినిమాకి ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటుడుగా ఎదుగుతున్నాడు. పుష్ప(pushpa) విక్రమ్(vikram)మూవీలే అందుకు ఉదాహరణ. నిజానికి తన సొంత భాష మలయాళంలో రెండు దశాబ్దాల పై నుంచే అక్కడి ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. క్యారక్టర్ ఏదైనా సరే తన మార్క్ నటనతో ఆ క్యారక్టర్ ని ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా నిలబడేలా చెయ్యగలడు. ఇక ఇప్పుడు రజని అప్ కమింగ్ ప్రాజక్ట్ వెట్టియాన్ లో ఒక కీలక పాత్రలో చేస్తున్నాడు. ఈ మూవీకి ఉన్న ఇంకో స్పెషల్ ఏంటంటే అమితాబ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో చేస్తున్నాడు. ఇక ఈ రోజు ఫాహద్ పుట్టిన రోజు. ఇదే టైం లో వెట్టియాన్(vettaiyan)సెట్స్ లో ఉన్నాడు. పైగా షూట్ లో రజనీ, అమితాబ్ కూడా ఉన్నారు.దీంతో ఆ ఇద్దరు ఫాహద్ కి బర్త్ డే విషెస్ చెప్పారు. అలాగే సినిమా రంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని కూడా ఆశీర్వదించారు.
ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో ఫాహద్ కంటే అదృష్టవంతుడు ఇంకొకరు ఉండరనే మాటలు వస్తున్నాయి..ఎందుకంటే పుట్టిన రోజు టైం కి షూట్ ఉండటం, పైగా ఇద్దరు లెజండ్రీ యాక్టర్స్ కాంబోలో సీన్ ఉండి వాళ్ళ ద్వారా అభినందనలు అందుకోవడం సామాన్యమైన విషయం కాదు కదా అని అంటున్నారు. ఇక 2021 లో పుష్ప వల్ల అవమానానికి గురయ్యిన ఫాహద్ 2024 లో ఈ మేర పగ తీర్చుకుంటాడనే ఆసక్తి అందరిలో ఉంది. వెట్టియాన్ అక్టోబర్ 10 న విడుదల కానుంది.ఇక పుష్ప 2 టీం కూడా ఫాహద్ బర్త్ డే సందర్భంగా లుక్ రిలీజ్ చేసింది. భన్వర్ సింగ్ షెకావత్ గా పైన ఖాకి డ్రెస్ వేసుకొని గళ్ళ లుంగీ కట్టుకొని కళ్ళ జోడు పెట్టుకొని చేతిలో రివాల్వర్ తో లుక్ ఒక రేంజ్ లో ఉంది