English | Telugu
పవన్ కళ్యాణ్ ప్లేస్ లో మోహన్ బాబు.. ప్రముఖ దర్శకుడు చెప్పిన నిజం
Updated : Oct 13, 2025
తెలుగు చిత్రపరిశ్రమతో దర్శకుడు 'ఎన్.శంకర్'(N Shankar)కి నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి సూపర్ స్టార్ కృష్ణ(Krishna),రమేష్ బాబు(Ramesh Babu)లు కలిసి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్న 'ఎన్ కౌంటర్'(Encounter)తో శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత పరిటాల రవి(Paritala Ravi)తండ్రి శ్రీరాములయ్య (Sriramulaiah)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన శ్రీరాములయ్య హిట్ తో టాప్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. యమజాతకుడు, జయం మనదేరా, భద్రాచలం, ఆయుధం, రామ్, జై బోలో తెలంగాణ వంటి పలు చిత్రాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి.
రీసెంట్ గా శంకర్ ప్రముఖ మీడియా ఛానల్ 'తెలుగు వన్'(Telugu One)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతు నా రెండో సినిమా శ్రీరాములయ్య తర్వాత నేను ఉషాకిరణ్ మూవీస్ లో సినిమా చెయ్యాలి. శ్రీ రాములయ్య సెట్స్ పై ఉన్నప్పుడే రామోజీరావు(Ramoji Rao)గారిని కలిసి కథని చెప్పాను. కథ ఆయనకి నచ్చడంతో హీరో ఎవర్ని అనుకుంటున్నావని అడిగితే పవన్ కళ్యాణ్ అని చెప్పాను. ఆ తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ని కలిసి కథ కూడా చెప్పాను. కానీ ఆ వైపు నుంచి వెంటనే రెస్పాన్స్ రాలేదు. ఈ లోపు శ్రీ రాములయ్య కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత కథల విషయంలో సెట్ అవ్వకపోవడంతో మళ్ళీ మోహన్ బాబు హీరోగానే యమజాతకుడు చేసానని శంకర్ చెప్పుకొచ్చాడు.
1999 వ సంవత్సరంలో యమజాతకుడు ప్రేక్షకుల ముందుకు రాగా, మోహన్ బాబు తన సొంత బ్యానర్ పై నిర్మించాడు. పరుచూరి బ్రదర్స్ కథని అందించగా, మోహన్ బాబు సరసన సాక్షి శివానంద్ జత కట్టింది. రాజేంద్ర ప్రసాద్, సత్యనారాయణ కీలక పాత్రలు పోషించారు.