English | Telugu

అవార్డ్ మనీ ని బాలకృష్ణ హాస్పిటల్ కు ఇచ్చేసిన క్రిష్..!

కంచె సినిమాకు జాతీయ అవార్డు అందుకున్నారు క్రిష్. మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ అవార్డును అందుకున్నారు క్రిష్. జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కంచె ఎంపికైంది. ఈ అవార్డ్ తో పాటు ఇచ్చిన డబ్బును, బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు విరాళంగా ఇచ్చేశారు క్రిష్. ఆయన తల్లితో పాటు, ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు ఈ హాస్పిటల్ అత్యుత్తమమైన సేవలు అందిస్తోందని, అందుకే ఈ అవార్డు మనీని హాస్పిటల్ కు విరాళంగా ఇస్తున్నానని ఆయన తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ప్రకటించారు. కాగా బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణిని క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన సన్నిహితుడైన రాజీవ్ రెడ్డి నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు క్రిష్. బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ గా శాతకర్ణి తెరకెక్కుతుండటం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.