English | Telugu

బాలీవుడ్ లో మనం రీమేక్...!

అక్కినేని అభిమానులతో పాటు, తెలుగు ప్రేక్షకులెవరూ మర్చిపోలేని సినిమా మనం. తెలుగు సినిమా లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ చివరి చిత్రం తెలుగు ప్రేక్షకులకు చాలా స్పెషల్. తెలుగు ప్రేక్షకులకే కాక, నాగార్జున కెరీర్ ను కూడా నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిందీ సినిమా. ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేస్తారని, చాలా భారీ బడ్జెట్ గా తెరకెక్కిస్తారని ప్రచారం సాగుతోంది. తాజాగా 24 మూవీ ప్రమోషన్లలో ఉన్న దర్శకుడు విక్రమ్ కె కుమార్ మనం గురించి ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. హిందీ సినిమాలో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మనం సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. ముంబైలో 24 షూటింగ్ జరుగుతున్నప్పుడు సంజయ్ లీలా భన్సాలీని విక్రమ్ కలిశాడట. అప్పుడే మనం రీమేక్ చేయాలనే కోరికను భన్సాలీ చెప్పాడట. అయితే ఇది ఎప్పుడు తెరకెక్కుతుందనేదానిపై స్పష్టత లేదట. బాలీవుడ్ లో బచ్చన్ల కుటుంబంపై ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. నేటివిటీని, సినిమాకు ప్రధానమైన ఫీల్ ను చెడగొట్టకుండా తీస్తే ఏ భాషలోనైనా ఈ సినిమాకు బాగానే ఆదరణ లభిస్తుందనడంలో సందేహం లేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.