English | Telugu

బూతులు తిట్టిన వాళ్లందరికీ సమాధానం ఇచ్చిన కంగనా...!

హృతిక్ తో వివాదంలో, పూర్తిగా వివాదాస్పదంగా మారిపోయింది కంగనా రనౌత్. ట్విట్టర్లో క్యారెక్టర్ లెస్ కంగనా అంటూ హ్యాష్ ట్యాగ్ రెండు మూడు రోజుల క్రితం ట్రెండ్ అయింది. ఆమెను క్యారెక్టర్ లేనిదని, క్షుద్రశక్తుల్నిపూజించేదని, వ్యభిచారి అని అనేక రకాలుగా నెటిజన్లు తిడుతున్నారు. వృత్తిపరంగా మంచి స్థాయికి చేరుకుంటున్న కంగనాను, ఈ వ్యక్తిగత వివాదాలు చాలా ఇబ్బంది పెడుతున్నా, ఆమె మాత్రం చాలా ధైర్యంగా ఉంది. తనను ఇష్టపడని వాళ్లందరికీ ఒక ఇంటర్వ్యూలో చెంపపెట్టులాంటి సమాధానమిచ్చింది కంగనా. " ఒక మహిళ ఫాస్ట్ గా ఉంటే, ఆమెను తప్పుడుదానిలా చూస్తారు. విజయాలను సాధిస్తుంటే సైకో అని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బరితెగించింది అని ముద్ర వేస్తారు. నేను ఏ తప్పు చేయలేదు. వేరొకరి గురించి భయపడటం నాకు అలవాటు లేదు. వృత్తి పరంగా సైకో పాత్రను, వ్యభిచారిణి పాత్రను కూడా వేశాను నేను. ఆ సమయంలో ప్రాస్టిట్యూట్ ల దగ్గరకు వెళ్లి వారి మనోవేదనను తెలుసుకున్నదాన్ని నేను. ఎవరైనా నన్ను ఆ పేరుతో తిట్టి, విజయం సాధించామనుకంటే వాళ్ల మూర్ఖత్వమే అవుతుంది. ఒక చిన్న ఊరిలో మొదలైన నా ప్రయాణం, నేడు జాతీయ అవార్డు గెలుచుకునే వరకూ సాగింది. నా విజయాలే విమర్శకులకు నా సమాధానం " అంటూ తనపై వస్తున్న విమర్శల్ని, తనను ద్వేషించే వాళ్లను తిప్పి కొట్టింది కంగనా. ఇంత ఇబ్బందుల్లో కూడా ఆమె ప్రదర్శిస్తున్న ధైర్యాన్ని, తెగువను మెచ్చుకుంటున్నారు చాలా మంది. త్వరలోనే కంగన, హృతిక్ విషయం ఒక కొలిక్కి వస్తుందని వీరిద్దరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.