English | Telugu

‘జైలర్‌2’పై నెల్సన్‌ దిలీప్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఇది రివెంజేనా?

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘కూలీ’ చిత్రానికి వచ్చిన బజ్‌ అంతా ఇంతా కాదు. టీజర్‌ రిలీజ్‌ అయిన రోజు నుంచి సినిమా రిలీజ్‌ వరకూ ఏ దశలోనూ ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌గానీ, బజ్‌గానీ తగ్గలేదు. సినిమాకి అంత హైప్‌ రావడంతో బాక్సాఫీస్‌ బద్దలైపోతుందేమోనన్న సందేహం అందరికీ కలిగింది. కానీ, ‘అంతలేదు’ అన్నట్టుగా సినిమా ఏవరేజ్‌ అనిపించుకుంది. కలెక్షన్లపరంగా చూస్తే 500 కోట్ల వరకు వచ్చిందని ఫిగర్స్‌ కనిపిస్తున్నా అందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. థియేటర్ల సంగతి పక్కన పెడితే ఓటీటీలో అయినా విజృంభిస్తుందని దర్శకనిర్మాతలు భావించారు. ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ స్టార్ట్‌ చేశారు. అయితే థియేటర్ల కంటే దారుణమైన కామెంట్స్‌ ఈ సినిమాపై రావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

లోకేష్‌ కనకరాజ్‌ గొప్ప డైరెక్టర్‌ అనే అందరిలోనూ ఫీలింగ్‌ ఉంది. కానీ, అతనిలో రోజురోజుకీ స్టఫ్‌ తగ్గిపోతోందని కూలీ సినిమా చూస్తే అర్థమైందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇదిలా వుంటే.. రజినీకాంత్‌ ప్రస్తుతం ‘జైలర్‌2’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్‌ను నటిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ఓ స్పెషల్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారనే టాక్‌ కూడా ఉంది. కూలీ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి జైలర్‌2 విషయంలో మరింత కేర్‌ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ‘జైలర్‌2’పై డైరెక్టర్‌ దిలీప్‌ నెల్సన్‌ చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారుతున్నాయి. అతను చేసిన కామెంట్స్‌ ఏమిటి, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందనేది తెలుసుకుందాం.

రజినీ, దిలీప్‌ నెల్సన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్‌’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 600 కోట్లకు పైగా కలెక్షన్‌ సాధించింది. ఆ సమయంలోనే ‘జైలర్‌’ చిత్ర నిర్మాత కళానిధి మారన్‌ చిత్రంలోని ప్రధాన నటీనటులకు, టెక్నీషియన్స్‌కు బహుమతులు అందించారు. ఈ సినిమాకి సంబంధించి జరిగిన సక్సెస్‌ మీట్‌లో దిలీప్‌ నెల్సన్‌కి ఘోరమైన అవమానం జరిగింది. జైలర్‌ సాధించిన విజయానికి కారకులంటూ అందర్నీ అప్రిషయేట్‌ చేసిన రజినీకాంత్‌ కనీసం డైరెక్టర్‌ దిలీప్‌ నెల్సన్‌ పేరు కూడా ప్రస్తావించలేదు. ఆ సమయంలో దిలీప్‌ ఎంతో ఫీల్‌ అయినట్టుగా అప్పటి విజువల్స్‌ చూస్తే అర్థమవుతుంది.

కూలీ రిలీజ్‌కి ముందు లోకేష్‌ను ఆకాశానికి ఎత్తేసిన రజినీ ఇప్పుడు సినిమా రిజల్ట్‌ చూసిన తర్వాత సైలెంట్‌ అయిపోయారు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం అన్నట్టుగా ‘జైలర్‌2’ విషయంలో కొన్ని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు దిలీప్‌. ‘ఈ సినిమా రిలీజ్‌ అయ్యే వరకు వెయిట్‌ చెయ్యండి. రజినీ సార్‌ మ్యాజిక్‌ ఏమిటో స్క్రీన్‌పై చూసి ఎంజాయ్‌ చెయ్యండి. సినిమా స్టార్ట్‌ చేసిన రోజు నుంచే హైప్‌ పెంచడం, అనవసరమైన బజ్‌ క్రియేట్‌ చేయడం నాకు ఇష్టం ఉండదు. మన సినిమా సమాధానం చెప్పాలి తప్ప మనకి మనం గొప్పలు చెప్పుకోవడం కరెక్ట్‌ కాదు. అందుకే సినిమాపై అంచనాలు పెరగకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నాను. మా టీమ్‌కి కూడా అదే చెప్పాను. సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తే.. రిలీజ్‌ అయిన తర్వాత వారి ఎక్స్‌పెక్టేషన్స్‌ని మా సినిమా రీచ్‌ అవ్వకపోతే ఒక్క మాటలో ‘వేస్ట్‌’ అనేస్తారు. అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే మేమంతా సైలెంట్‌గా ఉంటాం. ఎలాంటి అంచనాలు లేకుండా మా సినిమా రిలీజ్‌ అయి ఆడియన్స్‌కి గొప్ప అనుభూతిని కలిగిస్తుంది’ అన్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.