English | Telugu

దిల్ రాజు, సాయికిరణ్ అడవి

ప్రముఖ యువ నిర్మాత, పంపిణీదారుడూ అయిన దిల్ రాజు ఒక కొత్త చిత్రం నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రంలో నటించబోయే హీరో, హీరోయిన్ కూడా కొత్తవారినే పరిచయం చేయబోతున్నారు.కానీ ఈ చిత్రానికి దర్శకుడు మాత్రం గతంలో కృష్ణుడు హీరోగా "వినాయకుడు", "విలేజ్ లో వినాయకుడు" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సాయికిరణ్ అడవిని నియమించినట్లు సమాచారం.ఈ చిత్రాన్ని అత్యంత లోబడ్జెట్ లో నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారట.ఈ చిత్రానికి "కేరింత" అన్న పేరుని నిర్ణయించినట్లు సమాచారం.దిల్ రాజు ప్రస్తుతం యంగ్ రెబల్‍ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్, తాప్సి హీరోయిన్లుగా,దశరథ్ దర్శకత్వంలో "మిస్టర్ పర్‍ఫెక్ట్" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం