English | Telugu

నారా రోహిత్ చిత్రం లోగో లాంచ్

గతంలో "బాణం" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన యువ హీరో నారా రోహిత్ కుమార్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నా నచ్చిన కథ దొరకక పోవటంతో సంవత్సరన్నర కాలంగా ఖాళీగానే ఉన్నాడు.ప్రస్తుతం యస్.వి.కె.సినిమా పతాకంపై,పరశురాం దర్శకత్వంలో,వంశీ కృష్ణ శ్రీనివాస్ అనే నూతన నిర్మాత నిర్మించబోయే "ప్రొడక్షన్ నం;1"చిత్రంలో రోహిత్ హీరోగా నటించటానికి అంగీకరించారు.ఈ చిత్రం లోగో లాంచింగ్ జనవరి 29 వ తేదీన, హైదరాబాద్ ఫిలిం నగర్ లోకల యఫ్.యన్.సి.సి.(ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్)లో,"బృందావనం"ఫేం వంశీ పైడిపల్లి చేతుల మీదుగా ఈ చిత్రం లోగోని ఆవిష్కరింపజేశారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 13 వ తేదీన హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోలో ప్రారంభించి, మార్చ్ 1 నుండి రెగ్యులర్ షుటింగ్ జరిపి,మే నెల చివరి వారంలో కానీ లేదా జూన్ మొదటి వారంలో విడుదల చేస్తామని ఈ చిత్రం యూనిట్ అంది.ఈ చిత్ర దర్శకుడు పరశురామ్ గతంలో "యువత", "ఆంజనేయులు" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఈ చిత్ర నిర్మాత వంశీ కృష్ణ శ్రీనివాస్ షిప్పింగ్ రంగంలో ఉన్నారు. నిర్మాతగా ఇదే ఆయన తొలి చిత్రం.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం