English | Telugu

'దిల్' రాజు 'నిల్' రాజు అయ్యాడా?

టాలీవుడ్ లో వరుస హిట్లు కొట్టి గోల్డెన్ హ్యాండ్ గా పేరు సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు. ప్రస్తుతం ఆయన భారీ నష్టాలలో వున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పరిశ్రమకు చెందిన పెద్దలు కొంతమంది సినిమా ఇండస్ట్రీలలో ఎక్కువకాలం సక్సెస్ లు తోడురావని అంటుంటారు. ప్రస్తుతం దిల్ రాజు పరిస్థితి కూడా అదే విధంగా వుందని అంటున్నారు. ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షాక్‌ తరువాత పెద్ద సినిమాల నిర్మాణానికి బ్రేక్ ఇచ్చి, డిస్ట్రిబ్యూషన్‌లో జోరు పెంచాడు దిల్ రాజు. కానీ ఇక్కడ కూడా అతనికి అదృష్టం వరించలేదు. దసరా సీజన్ లో అతను డిస్ట్రిబ్యూషన్‌ చేసిన బడా సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో దిల్ రాజు భారీ అప్పులలో కురుకుపోయాడని ఫిల్మ్ నగర్ టాక్. దాని వల్ల అతను నిర్మిస్తున్న చిన్న సినిమాను కూడా వాయిదా వేశాడని అంటున్నారు. అయితే 'దిల్' రాజు నిజంగానే 'నిల్' రాజుగా మారాడా? లేక ఇవన్నీ ఇండస్ట్రీ వర్గాల పుకార్లా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే..!

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.