English | Telugu
‘డిక్టేటర్’ని రెచ్చగొడితే ప్రమాదం..!!
Updated : Oct 23, 2015
‘డిక్టేటర్’ టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ రోల్ లో విభిన్నమైన అవతారాల్లో దర్శనమిచ్చాడు. శ్రీవాస్ గత సినిమాల్లాగే యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ ఫ్యామిలీ ఎమోషన్స్ కు సమానంగా ప్రాధాన్యమిచ్చారని టీజర్ ఇండికేట్ చేస్తోంది. ‘రేయ్ నీ హిస్టరీలో బ్లడ్డుందేమో.. కానీ నా బ్లడ్డుకే హిస్టరీ ఉంది’’.... ‘‘మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. నాలాంటోణ్ని రెచ్చగొట్టడం జీవితానికే ప్రమాదకరం’’.. బాలయ్య మార్కు డైలాగ్ లు ఈ సినిమాలో కావాల్సినన్ని వున్నాయని టీజర్ చూస్తే అర్ధమవుతోంది. మొత్తానికి ‘డిక్టేటర్’ సినిమా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండబోతోందని తెలుస్తోంది.