English | Telugu

పవన్ రికార్డ్ బద్దలు కొట్టిన ఎన్టీఆర్

పది లక్షల మార్కును కూడా కేలం 36 గంటల్లోనే అందుకుంది యంగ్ టైగర్ ‘నాన్నకు ప్రేమతో’ టీజర్. తెలుగు సినిమాల వరకు ఇది రికార్డు. ‘బాహుబలి’ తెలుగు - తమిళ వెర్షన్ లు కలిపితే ఇంతకంటే వేగంగానే మిలియన్ మార్కును అందుకుంది. ఐతే కేవలం తెలుగు వరకు చూస్తే ‘నాన్నకు ప్రేమతో’దే రికార్డు. ‘నాన్నకు ప్రేమతో’ టీజర్ యూట్యూబ్ లైక్ ల విషయంలోనూ రికార్డు సృష్టించింది. ఈ టీజర్కి 26 వేల లైకులు కూడా రావడం విశేషం. ‘సర్దార్ గబ్బ్ సింగ్’ పేరిట ఉన్న రికార్డును ‘నాన్నకు ప్రేమతో’ దాటేసింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.