English | Telugu

బాలయ్య 'బెనిఫిట్ షో'...డౌట్లు వద్దూ..!!

సంక్రాంతికి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ‘డిక్టేటర్’ బెనిఫిట్ షోల గురించి కొంచెం డౌట్లు నెలకొన్నాయి. కానీ ఈ సినిమాకు కూడా తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో బెనిఫిట్ షోలు ప్లాన్ చేశారు అభిమానులు. హైదరాబాద్ లో బెనిఫిట్ షోలకు ఫేమస్ అయిన కూకట్ పల్లి భ్రమరాంభ థియేటర్లో ‘డిక్టేటర్’ షో పడనుంది. 14న శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ‘డిక్టేటర్’ షో పడనుంది. టికెట్లు అవసరమైన వాళ్లు 9618184881 9603032550 నంబర్లకు కాల్ చేయవచ్చు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలన్నింట్లో ‘డిక్టేటర్’ బెనిఫిస్ షోలు పడుతున్నాయి. రాయలసీమలో అర్ధరాత్రికే షోలు ప్లాన్ చేస్తున్నారు. ఇక యుఎస్ లో అయితే ముందు రోజే ప్రిమియర్ షోలు వేస్తున్నారు. బాలయ్యకిది 99వ సినిమా కావడంతో అక్కడ 99 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.