English | Telugu
నాన్నకు ప్రేమతో ట్వీట్ రివ్యూ
Updated : Jan 13, 2016
జూనియర్ ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో ఈ రోజు ఉదయం అభిమానుల ముందుకు వచ్చింది.ఇంతకీ సుకుమార్ ఏం చూపించాడు.. ఎన్టీఆర్ ఎలా చేశాడు.. అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అందుకే నాన్నకు ప్రేమతో ఎలా వుండబోతుందో మా ట్వీట్ రివ్యూ లో చూద్దాం:
ధియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా మొదలైంది. ఫ్యాన్స్ అందరూ ఎన్టీఆర్..ఎన్టీఆర్ అంటూ లోపలకి ఎంట్రీ ఇస్తున్నారు.
వెండితెర పైకి లేస్తోంది. అభిమానుల కేకలు..అరుపులతో ధియేటర్ అంతా సందడి నెలకొంది.
యంగ్ టైగర్ 'నాన్నకు ప్రేమతో' సినిమా స్టార్ అయింది. మూవీ లెంత్ ముందుగానే తెలుగువన్ చెప్పినట్టు రెండు గంటల నలభై ఎనిమిది నిముషాలు.
సుకుమార్ మార్క్ స్టైల్లో సినిమా టైటిల్స్ పడుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో సింపుల్ బట్ కూల్ ఎంట్రీ ఇచ్చాడు. ధియేటర్ మొత్తం రచ్చ రచ్చే.
డోన్ట్ స్టాప్..డోన్ట్ స్టాప్..ఎన్టీఆర్ సినిమాల్లో కంటే డిఫరెంట్ ఇంట్రడక్షన్ సాంగ్..సూపర్బ్ లిరిక్స్.
ఎన్టీఆర్ ఫాదర్ గా రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీ ఇచ్చారు..ఆయన గెటప్ కూడా బాగుంది.
జగపతి బాబు కూతురిగా రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ ఇచ్చింది..రకుల్ డబ్బింగ్ ..ఆమె వాయిస్ చాలా బాగుంది.
'నాన్నకు ప్రేమతో' సూపర్ హిట్ సాంగ్ మొదలైంది..ఫాలో ఫాలో అంటూ ఎన్టీఆర్ ..క్లాసీ డాన్స్ స్టేప్ లతో అదరగోడుతున్నాడు.
సుకుమార్ స్టైల్ రొమాంటిక్ సీన్స్ నడుస్తున్నాయి.
ఎన్టీఆర్..రకుల్ కెమిస్ట్రీ సూపర్ హాట్...
ఎన్టీఆర్..రకుల్ సూపర్ హాట్ సాంగ్..నా మనసు నీలో..నీ మనసు నాలో మొదలైంది. ఎన్టీఆర్ లుకింగ్ సూపర్ స్టైలిష్.. రకుల్ సూపర్ హాట్
'నాన్నకు ప్రేమతో' మైండ్ గేమ్స్ మొదలయ్యాయి.
ఎన్టీఆర్..జగపతి బాబు మధ్య ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ల మధ్య సీన్స్ నడుస్తున్నాయి.
'నాన్నకు ప్రేమతో' ఇంటర్వెల్ దగ్గలో వుంది.
రీవెంజ్ డ్రామా..మైండ్ గేమ్స్ తో..సింపుల్ ట్విస్ట్ వున్న ఇంటర్వెల్..
.....................................................టైమ్ ఫర్ ది 'కాఫీ బ్రేక్'.....................................................
బ్రేక్ తరువాత మూవీ ఎమోషన్ మోడ్ లోకి వెళ్ళిపోయింది.
రాజేంద్రప్రసాద్..ఎన్టీఆర్ మధ్య ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు నడుస్తున్నాయి.
ఎన్టీఆర్ ..రకుల్ మధ్య బ్రేక్ ఆప్
లవ్ మీ ఎగైన్ సాంగ్ ..ఎన్టీఆర్ డాన్సింగ్ ఇన్ లండన్ స్ట్రీట్స్..
సినిమాలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ వచ్చింది.. రకుల్ ప్రితి సింగ్ కూడా మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది.
'నాన్నకు ప్రేమతో' మాస్ సాంగ్ మొదలైంది. ఎన్టీఆర్ అదిరిపోయె స్టెప్పులతో ఆకట్టుకున్నాడు.
జగపతిబాబు, ఎన్టీఆర్ కి మద్య వస్తున్న సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్నాయి. జగపతి బాబు అద్భుతమైన నటన కనబరుస్తున్నారు.
సుకుమార్ ఇంటిలీజెంట్ తో సన్నివేశాలు నడిపిస్తున్నాడు. సినిమా హై ఎమోషనల్ స్థాయికి చేరుకుంది. అందరూ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపిస్తున్నాడు.
ఇప్పటివ వరకు ఎన్టీఆర్ చిత్రంలో ఎక్కడా లేని సందర్భం..ఎలాంటి ఫైట్స్ గానీ, రక్తపాతం గానీ లేకుండా సినిమా క్లయిమాక్స్ కి చేరుకుంది.
సినిమా హాయిగా ఎండింగ్ అయింది. 'నాన్నకు ప్రేమతో' కంప్లీట్ రివ్యూ కోసం తెలుగువన్.కామ్ చూస్తూనే ఉండండి.