English | Telugu

డబ్బింగ్ లో "దేవుడు చేసిన మనుషులు"

డబ్బింగ్ లో "దేవుడు చేసిన మనుషులు"...వివరాల్లోకి వెళితే మాస్ మహరాజా రవితేజ హీరోగా, నలకనడుము గోవా భామ ఇలియానా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం"దేవుడు చేసిన మనుషులు". ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ "దేవుడు చేసిన మనుషులు" చిత్రం షూటింగ్ బ్యాంకాక్ లో జరుపుకుంది.

ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయా రికార్డింగ్ థియేటర్లో జరుగుతున్నాయి. జూన్ తొలి వారంలో ఈ చిత్రం ఆడియోని విడుదల చేసి, జూలై నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో పద్మాలయా పతాకంపై, యన్.టి.ఆర్, కృష్ణ హీరోలుగా, సూపర్ స్టార్ కృష్ణ ఇదే పేరు మీద ఒక చిత్రాన్ని నిర్మించగా అది సూపర్ హిట్టయ్యింది.