English | Telugu

బాలీవుడ్ హీరోయిన్‌లకు ఝలకిచ్చిన దీపిక

అందం, టాలెంట్ వున్న బాలీవుడ్ హీరోయిన్లలో మోస్ట్ పాపులర్ భామ దీపికా పదుకొనె. గత ఏడాది ఆమె నటించిన మూడు చిత్రాలకు 500 కోట్లు వసూలు అయ్యాయి. దీంతో బాలీవుడ్ లో దీపిక పదుకొనే డేట్ల కోసం నిర్మాతలు క్యూ కట్టారు. మేడమ్ తమ సినిమాలో నటిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ గ్యారెంటీ అనే కంక్లూజన్ కి వచ్చారు. అయితే బాలీవుడ్ లో టాలెంట్ కి, గ్లామర్ కి కొదవ లేదు. కరీనా, కత్రీనా, ప్రియాంక, అనుష్క ఇలా ఆ లిస్టు చాలా పెద్దదే. అయితే వారందరినీ పక్కన పెట్టి టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది దీపిక. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'బాజీరావు మస్తానీ' అనే చిత్రంలో హీరోయిన్ గా సైన్ చేసింది దీపిక. ఈ సినిమాకి దీపికా రెమ్యూనరేషన్ 9 కోట్లు మాత్రమేనట. ఈ విషయం విన్న దగ్గర నుంచి మిగతా బీటౌన్ భామలు తమ మార్కెట్ ఎలా పెంచుకోవాలి అనే ఆలోచనలు పడి మునకలేస్తున్నారట.