English | Telugu

సినీ పరిశ్రమలో విభేదాలు లేవు: దాసరి

ఆంధ్రప్రదేశ్‌లో హుద్‌హుద్‌ తుపాను కారణంగా జరిగిన విధ్వంసంపై స్పందించి ‘మేముసైతం’ అంటూ సినీ పరిశ్రమ తరఫున బాధితులను ఆదుకునేందుకు మునుపెన్పడూ లేనంత భారీస్థాయిలో కార్యక్రమం నిర్వహిస్తోన్న విషయం విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా దాసరి నారాయణ రావు మాట్లాడుతూ..సినీ పరిశ్రమలో విభేదాలున్నాయనీ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. వెండితెర వున్నంతకాలం తెలుగు సినీ పరిశ్రమ ఒక్కటిగానే వుంటుందని అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడూ సామాజిక బాధ్యతతో వ్యవహరించేవారనీ, వారి తర్వాత ఇప్పటి తరం కూడా అదే దారిలో నడుస్తోందని దాసరి వ్యాఖ్యానించారు. ప్రజలకు ఎప్పుడెలాంటి కష్టం వచ్చినా చిత్ర పరిశ్రమ స్పందిస్తుందనడానికి ‘మేముసైతం’ ఓ నిదర్శనమని అన్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.