English | Telugu

తెలుగు సినీ పరిశ్రమ 'మేము సైతం' ప్రారంభ౦

'హుద్‌ హుద్‌' తుపాను బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినీ చిత్రపరిశ్రమ `మేము సైతం' అంటూ చేపట్టిన బృహత్తర కార్యక్రమ౦ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. అనంత శ్రీరామ్ రచించి, సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన `మేము సైతం' గీతాన్ని గాయని, గాయకులూ ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, దర్శకరత్న దాసరినారాయణరావు, రాఘవేంద్రరావు, నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు తదితర ప్రముఖలు హాజరయ్యారు. వినోద కార్యక్రమాల ద్వారా విరాళాలు సేకరించి, ఆ మొత్తాన్ని మ్యుమంత్రి సహాయనిధికి అందించాలనే లక్ష్యంతో తెలుగు చలన చిత్రసీమ 12గంటల పాటు వివిధ కార్యక్రమాల ద్వార ఏకధాటిగా వినోదం పంచబోతున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.