English | Telugu

అందరిలో జోష్‌ని నింపిన బాలయ్య

'హుద్‌ హుద్‌' తుపాను బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినీ చిత్రపరిశ్రమ చేపట్టిన ‘మేముసైతం’ కార్యక్రమం మొదలైన కొద్దిసేపటికే నందమూరి బాలయ్య సింగర్‌గా అవతారమెత్తి అందరిలోనూ జోష్‌ని నింపారు. ‘చలాకీ చూపుల్తో..’ అంటూ సాగే పాటని బాలకృష్ణ పాడి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. స్టేజీపైన బాలయ్య జోష్ కి అందరూ కేరింతలు కొట్టారు. బాలయ్య రియల్ లైఫ్ లో ఏంత జోష్ లో వుంటారో మరోసారి స్పష్టమైంది.