English | Telugu
ఎర్రబస్సులో దాసరి మనవరాలు రాక
Updated : Jul 17, 2014
150 చిత్రాల దర్శకుడు దాసరి రూపొందిస్తున్న 151వ చిత్రంలో ఆయన మనవరాలు నీరాజిత నటించనుంది. తాతా మనువల కథాంశంతో వస్తున్న ఈ చిత్రానికి దాసరి దర్శకత్వం వహించడంతో పాటు తాతగా కూడా నటిస్తున్నారు.
తాతా మనవళ్ల కథ చిత్రంతో దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టిన దాసరి తాతాగా నటిస్తున్న ఈ చిత్రంతో ఆయన మనవరాలు తెరకు పరిచయం కావడం విశేషం. ఈ చిత్రంలో మనువడిగా మంచు విష్ణు నటిస్తున్నాడు. కేథరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన మంజ పై చిత్రం ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎర్రబస్సు అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.