English | Telugu

చూపించండీ...అరే చూపించండీ...


టైటిల్ చూసి ఏదో అనుకొని తప్పుగా ఊహించకండి. ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’ పేరుతో వస్తున్న సినిమా పోస్టర్లు చూసే వుంటారు. ఫస్ట్‌లుక్, సినిమా అప్‌డేట్స్, మొన్న జరిగిన ఆడియో లాంచ్ ఇంత వరకూ ఈ చిత్రంలో హీరోయిన్ ఫేసు చూపించలేదు. హీరోయిన్ గ్లామర్‌తో సినిమాకు కావలసినంత హైప్ క్రియేట్ చేసుకోవటం చూస్తుంటాం. కానీ ఇలా ముసుగులో వున్న హీరోయిన్ తో ఈ సినిమా ప్రచారం చేస్తున్నారు. చివరకు ఈ సినిమా సంబంధించిన ఫంక్షన్లలోనూ ఆమె ముసుగు వనితగానే దర్శనమిచ్చింది. రామానాయుడు చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదల అయింది. అక్కడా ఇదే తంతు.
నేటి సొసైటీలో అమ్మాయిలకు ఎదురవతున్న వివిధ సమస్యల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది అని ఈ చిత్ర దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ఈ ముసుగుకి, చిత్ర కథకి ఏ రకమైన సంబంధముందో తెలియాలాంటే ఈ నె
18 వరకూ ఆగాల్సిందే.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.