English | Telugu

‘విసిగిపోయాను.. నన్ను చంపేయండి’.. దుమారం రేపుతున్న కమెడియన్‌ ట్వీట్స్‌!

అతను ఓ కమెడియన్‌. సినిమాల్లో తన మాటలతో చేష్టలతో ప్రేక్షకుల్ని నవ్వించడం, వారికి ఆనందాన్ని పంచడం అతని పని. గత కొన్ని సంవత్సరాలుగా అదే పనిలో ఉన్నాడు. జర్నలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన అతను టాలీవుడ్‌లో మంచి కమెడియన్‌గా స్థిరపడ్డాడు. అతను నటుడే కాదు, లిరిక్‌ రైటర్‌ కూడా. అతనే రాహుల్‌ రామకృష్ణ. అర్జున్‌రెడ్డి చిత్రంలో చేసిన క్యారెక్టర్‌ ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన రాహుల్‌.. ఆ తర్వాత భరత్‌ అనే నేను, గీత గోవిందం, హుషారు, జాతిరత్నాలు, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ కమెడియన్‌గా కొనసాగుతున్న రాహుల్‌.. అక్టోబర్‌ 2 గాంధీ జయంతి రోజున అతను చేసిన ట్వీట్స్‌ సినీ, రాజకీయ రంగాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అయితే అప్పుడప్పుడు ఇలాంటి వివాదాస్పద ట్వీట్లు చేయడం రామకృష్ణకు అలవాటే. ఆ క్రమంలోనే మరోసారి తన ట్వీట్స్‌తో వార్తల్లోకి వచ్చాడు.

మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. వచ్చి పరిస్థితుల్ని చక్కదిద్దాలని, డబుల్‌ డోర్‌ కంబ్యాక్‌ కోసం ఎదురు చూస్తున్నానని కేటీఆర్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేసాడు. అలాగే ‘విసిగిపోయాను, నన్ను చంపేయండి’, ‘హైదరాబాద్‌ మునిగిపోయింది, హామీలన్నీ విఫలమయ్యాయి, వీటిని చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ట్యాగ్‌ చేసి ట్వీట్‌ చేసాడు. ఇవే కాదు, మహాత్మాగాంధీపై కూడా వివాదాస్పదమైన కామెంట్స్‌ చేశాడు. ‘గాంధీ సాధువు కాదు.. అతను మహాత్ముడే కాదు’ అని ట్వీట్‌ చేశాడు. గాంధీ జయంతి రోజున ఈ ట్వీట్‌ చేయడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. అయితే ఈ కామెంట్స్‌ చేసిన కొన్ని గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఎకౌంట్‌ను డీయాక్టివేట్‌ చేయడం గమనార్హం.

కొన్ని అనవసర విషయాల్లో ఇలా అప్పుడప్పుడు నోరు పారేసుకోవడం రాహుల్‌కి అలవాటేనని రెగ్యులర్‌గా అతని ట్వీట్స్‌ ఫాలో అవుతున్న నెటిజన్లు చెబుతున్నారు. తాజాగా చేసిన ట్వీట్ల గురించి సోషల్‌ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొందరు రాజకీయ నేతలు అతని బెదిరించి ఉంటారని, అందుకే ఎకౌంట్‌ను డీయాక్టివేట్‌ చేశాడని అంటున్నారు. కొందరు అతనికి ఫేవర్‌గా కామెంట్స్‌ పెడుతుండగా, మరికొందరు.. కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.. హాయిగా సినిమాలు చేసుకోకుండా అతనికెందుకు ఇవన్నీ అంటూ హితవు పలుకుతున్నారు.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.