English | Telugu

అజిత్‌ కొత్తకారు రేటు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌కి తమిళనాడులోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అతని సినిమాలకు ఇక్కడ కూడా మంచి క్రేజ్‌ ఉంది. అతనిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే రేసింగ్‌ అంటే విపరీతంగా ఇష్టపడతాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్‌ రేసింగ్‌లో, బైక్‌ రేసింగ్‌లో పాల్గొన్నాడు. అందుకే రకరకాల కార్లపై మక్కువ ఎక్కువ. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు కొత్త కార్లు, కొత్త బైక్‌లు కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. అలా అజిత్‌ ఫెరారి ఎస్‌ఎఫ్‌90 స్ట్రాడేల్‌ కారును కొనుగోలు చేశారు. ఈ కారు ఖరీదు రూ.9 కోట్లు. రెడ్‌ కలర్‌లో ఉన్న ఈ కారులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయట.

ఇప్పటికే అజిత్‌ దగ్గర చాలా కార్లు ఉన్నాయని తెలుస్తోంది. అయినా ఈ లేటెస్ట్‌ మోడల్‌ కారును కొన్నారు. దానికి సంబంధించిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆ కారు పక్కనే కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు అజిత్‌. దీనిపై స్పందిస్తున్న అతని అభిమానులు కంగ్రాట్స్‌ చెబుతున్నారు. కోలీవుడ్‌లో ఇంతటి ఖరీదైన కారును కలిగి ఉన్న సెలబ్రిటీలు లేరనే చెప్పాలి. ఈ విషయంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు అజిత్‌.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.