English | Telugu

దిశాపటాని కి యోగి ఆదిత్యనాద్ హామీ.. కీలక నిర్ణయాలు వెల్లడి  

ఉత్తరప్రదేశ్‌(Uttar pradesh)బరేలీలోని ప్రముఖ అగ్ర హీరోయిన్ 'దిశాపటాని'(Disa patani)ఇంటి దగ్గర సెప్టెంబర్ 12 న గ్యాంగ్ స్టర్స్ గోల్డీబ్రార్‌, రోహిత్‌ గోదారా ఆధ్వర్యంలో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఇండియన్ ఫిలిం సర్కిల్స్ లో పెద్ద సంచలనమే సృష్టించింది. దిశా పటాని సోదరి మాజీ అధికారి 'ఖుష్భు' ఒక వర్గం మనోభావాలు దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చెయ్యడమే కాల్పులకి ప్రధాన కారణం.

ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 'యోగి ఆదిత్యనాధ్'(Yogi Adityanath)ప్రత్యేక దృష్టి సారించారు. కాల్పులు జరిపిన వాళ్ళని ఎక్కడ ఉన్నా పట్టుకొని తీరతామని దిశా పటాని కుటుంబ సభ్యులకి హామీ ఇచ్చారు. ఈ విషయంపై దిశా పటాని తండ్రి 'జగదీష్ పటాని' మీడియాతో మాట్లాడుతు యోగి ఆదిత్యనాధ్ గారు ఫోన్ చేసి దైర్యం చెప్పారు. రాష్టం మొత్తం మీకు అండగా ఉంటుంది. పూర్తి భద్రతని ఇస్తాం. ఈ విషయంలో ఎటువంటి నిర్లష్యం చెయ్యం. నిందితులు ఎక్కడ ఉన్నా పట్టుకుంటామని హామీ ఇచ్చారని తెలియచేసాడు. జగదీష్ పటాని పోలీస్ శాఖలో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి రిటైర్డ్ అయ్యాడు.

దిశా పటాని కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం 'హోళిగార్డ్స్ సాగా, ది పోర్టల్ అఫ్ ఫోర్స్' అనే ఇంగ్లీష్ చిత్రంలో చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో కలిసి 'వెల్ కం టూ ది జంగిల్' అనే చిత్రం చెయ్యగా డిసెంబర్ లో విడుదల కాబోతుంది. వరుణ్ తేజ్, పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన 'లోఫర్' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన 'దిశా పటాని' గత ఏడాది ప్రభాస్ తో కల్కి 2898 ad ,సూర్య కంగువ లో మెరిసి మెప్పించింది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...