English | Telugu

చిరంజీవి, బాలకృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందన! 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi),గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna)ఈ ఇద్దరు తెలుగు సినిమా పరిశ్రమకి లభించిన గొప్ప వరం. సుదీర్ఘ కాలం నుంచి ఎన్నో చిత్రాలలో వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తూ అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వారివురి ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకి కూడా హాజరవుతుంటారు.

ఆంధ్రప్రదేశ్ లో వైసిపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రతినిధులతో టికెట్ రేట్స్ పెంపు గురించి మాట్లాడడానికి చిరంజీవి ఆధ్వర్యంలో నాగార్జున,మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి వంటి వారు చర్చలు జరపడానికి వెళ్లారు. ఆ సమయంలో బాలకృష అందుబాటులో లేడు. ఈ విషయంపై కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో బాలకృష్ణ మాట్లాడుతు చిరంజీవి వెళ్లడం వల్ల టికెట్ రేట్స్ పెంచలేదని, గత ప్రభుత్వాన్ని నిందిస్తూ మాట్లాడటం జరిగింది. చిరంజీవి వల్ల పెంచలేదని యాదృచ్చికంగా అన్న మాట. ఆ మాటల వెనక గత ప్రభుత్వం సినిమా వాళ్ళని అవమానించిందని బాలకృష్ణ ఉద్దేశ్యం. ఆయన పూర్తి ప్రసంగం వింటే ఈ విషయం తెలుస్తుంది. కానీ కొన్ని రాజకీయ దుష్ట శక్తులు బాలకృష్ణ, చిరంజీవి మధ్య గొడవలు పెట్టడానికి చూస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా ఆ దుష్ట శక్తులు అదే పనిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఈ విషయంపై ఎలా మాట్లాతాడనే చర్చ అందరిలో జరుగుతుంది. పవన్ ఇటీవల అస్వస్థతకి గురి కావడంతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.

పవన్, బాలకృష్ణ మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. పైగా కూటమి ద్వారా అధికారంలో ఉన్నారు. రీసెంట్ గా 'ఓజి'(OG)రిలీజ్ అయినప్పుడు బాలకృష్ణ మాట్లాడుతు తమ్ముడు సినిమా రిలీజ్ అవుతుంది. ఘన విజయం సాధించాలని మాట్లాడాడు.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.