English | Telugu

చిరుతో చ‌ర‌ణ్ ద‌ర్శ‌కుడు!

`సీటీమార్`తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేశారు ద‌ర్శ‌కుడు సంపత్ నంది. మ్యాచో స్టార్ గోపీచంద్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టించిన ఈ స్పోర్ట్స్ డ్రామా.. బాక్సాఫీస్ ముంగిట వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవికి ఓ స్టోరీ లైన్ వినిపించార‌ట సంప‌త్. అది న‌చ్చ‌డంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయ‌మ‌ని సూచించార‌ట చిరు. దీంతో.. ప్ర‌స్తుతం సంప‌త్ ఆ ప‌నిలో ఉన్నార‌ని టాలీవుడ్ బ‌జ్. ఒక వేళ అదే గ‌నుక నిజ‌మైతే.. మెగా కాంపౌండ్ లో సంప‌త్ నంది చేయ‌బోయే రెండో సినిమా ఇదే అవుతుంది. గ‌తంలో చిరు త‌న‌యుడు, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో `ర‌చ్చ‌` (2012) తీశారు సంప‌త్. విమ‌ర్శ‌కులను మెప్పించ‌లేక‌పోయిన‌ప్ప‌టికీ.. స‌ద‌రు మాస్ ఎంట‌ర్టైన‌ర్ స‌గ‌టు ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచి బాక్సాఫీస్ విన్న‌ర్ గా నిలిచింది.

మ‌రి.. చ‌ర‌ణ్ కి సూప‌ర్ హిట్ ఇచ్చిన సంప‌త్.. చిరు కాంబినేష‌న్ లోనూ ఆ ఫీట్ రిపీట్ చేసి మ‌రో `మెగా` హిట్ ని త‌న ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.

కాగా, ప్ర‌స్తుతం చిరు `ఆచార్య‌`, `గాడ్ ఫాద‌ర్`, `భోళా శంక‌ర్`తో పాటు బాబీ డైరెక్టోరియ‌ల్ చేస్తున్నారు. అవ‌న్నీ పూర్త‌య్యాకే సంప‌త్ నంది సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముంద‌టున్నారు. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో?

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.