English | Telugu
'పటాస్'ను దక్కించుకున్న దిల్ రాజు
Updated : Dec 19, 2014
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కమ్ నిర్మాత దిల్ రాజు కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమా హక్కులను ఆంధ్రా, నై జాం ఏరియాలలో సొంతం చేసుకున్నాడు. అంతేకాక వైజాగ్, కృష్ణ మరియు నైజాం ప్రాంతాలలో ఈ సినిమాని సొంతంగా రిలీజ్ చేయనున్నాడు. ఈ ‘పటాస్’ సినిమా డిసెంబర్ లో విడుదలకు సన్నాహాలు చేసినా నందమూరి జానకిరామ్ అకాల మరణం వలన వాయిదాపడింది. ప్రస్తుతం ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన శృతి సోది హీరోయిన్ నటిస్తుంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ ట్రైలర్ కు, పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇందులో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.