English | Telugu

మొత్తానికి ఇద్ద‌రూ బ్లూ ఫిల్మ్ మేక‌ర్సే

క‌డుపు చించుకొంటే కాళ్ల‌మీద ప‌డుతుందంటారు. ఇప్పుడు అదే జ‌రుగుతోంది. ఇద్ద‌రు నిర్మాత‌లు తెలుగు సినిమా ప‌రువుని గంగ‌లో క‌లిపేస్తున్నారు. నువ్వంటే నువ్వంటే.. ఒక‌రిపై ఒక‌రు బుర‌ద చ‌ల్లుకొంటున్నారు. తెలుగు సినిమా వెనుక‌.. ఇంత కుళ్లుంటుందా..?? అంటూ అంద‌రూ అవాక్క‌య్యేలా చేస్తున్నారు. మొన్న న‌ట్టికుమార్ ప్రెస్‌మీట్ పెట్టి... కొంత‌మంది సినిమా వాళ్ల జాత కాలు బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈరోజు సి.క‌ల్యాణ్ మైకు అందుకొన్నారు. బ్లూ ఫిల్మ్స్ తీసిన చ‌రిత్ర నీది.. అంటూ న‌ట్టికుమార్‌ని త‌న‌దైన స్టైల్‌లో క‌డిగిపారేశాడు. న‌ట్టికుమార్ ఊరుకుంటాడా?? బ్లూ ఫిల్మ్స్ తీసింది నువ్వా, నేనా? అంటూ కౌంట‌ర్ ఎటాక్ ఇచ్చాడు. అంతేకాదు.. ముగ్గురు హీరోయిన్ల‌తో నీకు సంబంధాలు ఉన్నాయ‌న్న సంగ‌తి జ‌నాల‌కు చెప్పాలా?? అంటూ వార్నింగ్ ఇచ్చాడు. మొత్తానికి ఇద్ద‌రూ ఇద్ద‌రే అన్న‌మాట‌. తెలుగు ఇండ్ర‌స్ట్రీలో బ‌డా నిర్మాతలుగా చలామ‌ణి అవుతూ.. బ్యాక్ గ్రౌండ్‌లో బ్లూఫిల్మ్స్ తీస్తున్నార‌న్న‌మాట‌. ఎవ‌రి విమ‌ర్శ‌ల్లోఎంత నిజం ఉందో, ఎవ‌రి అబ‌ద్ద‌మో దేవుడికి ఎరుక‌... కానీ ఇలా బ‌జారుకెక్కి సినిమా ప‌రువుని తీసి పారేస్తున్నారు. ఈ వాదులాట ఎక్క‌డ‌కు వెళ్లి ఆగుతుందో, ఇంకెన్ని నిజాలు చెవులారా వినాల్సివ‌స్తుందో..??

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.