English | Telugu

స్వామిరారా సీక్వెల్‌లో స్వాతి ప్లేస్‌లో రీతూ

నిఖిల్, స్వాతి జంటగా 2014లో విడుదలై సూపర్‌హిట్ అయిన స్వామిరారా సినిమాకు సీక్వెల్‌ చేయాలని డిసైడయ్యాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. సీక్వెల్ సినిమా కాబట్టి పాత జంటను రీపిట్ చేయడం కామన్. అయితే ఈ చిత్రంలో‌ నిఖిల్‌ను హీరోగా నటిస్తుండగా.. హీరోయిన్‌గా స్వాతి నటిస్తుందని అనుకున్నారు కాని ఆమె ప్లేస్‌లో మరో హీరోయిన్‌‌ను తీసుకున్నాడు సుధీర్. ఆవిడ ఏవరో కాదు "పెళ్లిచూపులు" సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రీతూ వర్మ ఇందులో హీరోయిన్‌గా కన్ఫార్మ్ అయ్యింది. సీక్వెల్ సినిమాలో నిఖిల్‌ను తీసుకుని హీరోయిన్‌గా స్వాతిని ఎందుకు తీసుకోలేదోనని ఫిల్మ్‌నగర్‌లో చెవులు కొరుక్కుంటున్నారు సినిమా జనాలు.