English | Telugu

జ‌న‌తా గ్యారేజ్ సెన్సార్ రివ్యూ

ఎన్టీఆర్ `జ‌న‌తా గ్యారేజ్‌` విడుద‌ల‌కు రెడీ అయ్యింది. అనుకొన్న దానికంటే ఓరోజు ముందే జ‌న‌తా గ్యారేజ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమా సెన్సార్ కూడా పూర్త‌య్యింది. సెన్సార్ వాళ్లు ఈ చిత్రానికి యు బై ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? సెన్సార్ వాళ్ల రివ్యూ ఏమిటి?

* కాన్సెప్ట్‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా... కొర‌టాల శివ దాన్ని కొత్త‌గా మ‌లిచే ప్ర‌య‌త్నం చేశాడ‌ట‌.

* ఎన్టీఆర్ లుక్‌.. ఫుల్ మాసీగా ఉంద‌ని, ఒక‌ట్రెండు పాట‌ల్లో ఎన్టీఆర్ డాన్సులు అదిరిపోయాయ‌ని టాక్‌.

* మోహ‌న్‌లాల్ పాత్ర ప‌వ‌ర్‌ఫుల్ గా సాగిపోయింద‌ట‌. ఒక ద‌శ‌లో ఎన్టీఆర్ కంటే మోహ‌న్ లాల్ పాత్రే ఎక్కువ ప‌వ‌ర్‌ఫుల్ అనిపించేంత రేంజులో ఉంద‌ని తెలుస్తోంది.

* ఇంట్ర‌వెల్ ఎపిసోడ్‌కి ముందు ఓ 20 నిమిషాలు సింప్లీ సూప‌ర్బ్ అని తేలింది. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ కాస్త సాదాసీదాగానే ఉంద‌ట‌.

* నిత్య‌మీన‌న్ పాత్ర‌కు అంత సీన్ లేద‌ని, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు త‌ర‌హా పాత్ర అన్న‌ది సెన్సార్ వ‌ర్గాల మాట‌. స‌మంత మాత్రం ఓ పాట‌లో చిన్ని చిన్ని డ్ర‌స్సులేసుకొని గ్లామ‌ర్ షో చేసింద‌ట‌.

* సినిమా అంతా సీరియ‌స్ మోడ్‌లో సాగింద‌ని, ఎంట‌ర్ టైన్‌మెంట్‌కు స్కోప్ లేద‌ని తేలింది.

* ఆర్‌.ఆర్‌తో దేవిశ్రీ ప్ర‌సాద్ అల‌రించాడ‌ని, సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడ‌ని చెప్పుకొంటున్నారు.

* ఎన్టీఆర్ మోహ‌న్‌లాల్ పాత్ర‌లే కాదు.. అజ‌య్‌, బ్ర‌హ్మాజీ క్యారెక్ట‌ర్లూ బాగా వ‌చ్చాయ‌ట‌.

* సెకండాఫ్ బాగా స్లో అయ్యింద‌ని, అయితే క్లైమాక్స్‌లో మ‌ళ్లీ కొర‌టాల అందుకొన్నాడ‌ని స‌మాచారం.

* సెన్సార్ వాళ్ల రిపోర్ట్ చూస్తుంటే ఈసినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డం ఖాయం అనిపిస్తోంది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.