English | Telugu

"బిజినెస్ మ్యాన్" "దూకుడు" ని కొట్టాలి- శ్రీను వైట్ల

"బిజినెస్ మ్యాన్" "దూకుడు" ని కొట్టాలి అని దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, మనసున్న మంచి నిర్మాత డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్నన చిత్రం "బిజినెస్ మ్యాన్".

ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం ఆడియో విడుదల సందర్భంలో "దూకుడు" చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల ప్రసంగిస్తూ "మీరు నాకు "దూకుడు" రూపంలో బ్లాక్ బస్టర్ చిత్రమిచ్చారు. ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులందరికి థ్యాంక్స్."దూకుడు"ని "బిజినెస్ మ్యాన్" కొట్టాలని కోరుతున్నా. అది మీ చేతుల్లోనే ఉంది. ఈ చిత్రం ప్రోమోస్ చూశాను. చాలా బాగున్నాయి. పూరీ జగన్నాథ్ గారి పెన్ పవరేంటో మనందరికీ తెలుసు. డైలాగులు చాలా బాగున్నాయి. ఈ సినిమా చూడాలని మీలాగే నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని అన్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...