English | Telugu
మెగాఫ్యాన్స్ ఆశల్ని సరైనోడు నిలబెడతాడా..?
Updated : Apr 11, 2016
మెగా 60 తర్వాత, బ్రూస్ లీ అంటూ వచ్చాడు రాం చరణ్. కానీ అది డిజాస్టర్ గా మిగిలిపో్యింది. అయినా మెగాఫ్యాన్స్ భరోసాకు ఢోకా లేదు. సర్దార్ ఉన్నాడు కదా అనే ధైర్యంతో ఉన్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ తో రికార్డులు బద్ధలైపోవాలని కోరుకున్నారు. కానీ సర్దార్ కూడా వాళ్ల ఆశల్ని అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు మెగాభిమానుల కళ్లన్నీ అల్లు అర్జున్ సినిమాపైకి తిరిగాయి. సర్దారోడు చేయలేనది సరైనోడు చేసి చూపిస్తాడని నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పటికే బన్నీ-బోయపాటి ల క్రేజీ కాంబినేషన్, యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ ఫ్యాన్స్ లో మంచి ఉత్సాహాన్ని నింపింది. సరైనోడు, ఆ తర్వాత సుప్రీం. ఈ రెండే దగ్గర్లో ఉన్న మెగా సినిమాలు. అందుకే ఎలాగైనా ఇవి హిట్ కొట్టాలని చిరు, పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి సరైనోడు వీళ్ల ఆశల్ని తీరుస్తాడో లేదో చూడాలి.