English | Telugu

భోజనం తరువాత స్వీట్ మాదిరి నా పాత్ర.. చిరంజీవి

శుక్రవారం రామ్ చరణ్ తేజ్ నటించిన "బ్రూస్‌లీ" సినిమా ఆడియో ఆవిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ అడియో ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి "బ్రూస్‌లీ" సినిమాలో ఓ డైలాగ్ ను చెప్పి అభిమానులను ఉర్రూతలూగించారు. "బ్రూస్ లీ" ఆడియో సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రాంచరణ్ ఈ సినిమాలో నటించేందుకు చాలా కష్టపడ్డాడని చెప్పారు. అంతేకాదు ఈ సినిమాలో తన ఎంట్రీ గురించి మాట్లాడుతూ..ఈ సినిమాలో తన ఎంట్రీ కొసమెరుపులాగ ఉంటుందని.. ఇంకా తన పాత్ర గురించి చెప్పాలంటే భోజనం మొత్తం తిన్నా తరువాత ఒక స్వీటు తిన్న మాదిరిగా ఉంటుంది చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా ఇంకా ఎలాగూ సినిమా రిలీజ్ కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి సినిమాలో డైలాగ్ చెప్పడానికి ఏముందని బాస్ మీ స్టెమినోను, మీ స్పీచ్‌ను అందుకోలేను అని సినిమాలో రాంచరణ్ కొట్టిన డైలాగ్ ను చిరంజీవిగారు కొట్టారు. ఈ సందర్బంగా తన 150 వ సినిమా వివరాలు కూడా తెలిపారు. తన 150 సినిమా పూర్తి స్థాయిలో ఉంటుందని.. ఈ సినిమాకు రాంచరణ్, సురేఖ నిర్మిస్తున్నారని.. ఇంకో పదిహేను రోజుల్లో పూర్తి వివరాలు తెలుపుతానని చెప్పారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.