English | Telugu

బ్ర‌హ్మోత్సవం.. ఒక్క పాట‌కు రూ.3.5 కోట్లు?

చిన్న సినిమాలు రెండు మూడు కోట్ల‌లో పూర్తి చేస్తారు. స్టార్ హీరో సినిమా అన‌గానే మినిమం రూ.50 కోట్ల‌యినా పెట్టాల్సిందే. అందులోనూ మ‌హేష్ బాబు సినిమా అంటే ఖ‌ర్చుకు వెన‌కాడ‌కూడ‌దు. పైగా శ్రీ‌మంతుడు వంద కోట్ల క్ల‌బ్‌లో చేరిందాయె. అందుకే... ఇప్పుడు ఇంకాస్త స్వేచ్ఛ వ‌స్తుంది. అందుకే బ్ర‌హ్మోత్స‌వం సినిమా విష‌యంలో నిర్మాత‌లు ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌డంలేదు.

ఒక్క పాట‌కే రూ.మూడున్న‌ర కోట్లు ఖ‌ర్చు పెట్టార‌ని టాక్‌. ఇటీవ‌లే బ్ర‌హ్మోత్స‌వం సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. సంగీత్ నేప‌థ్యంలోని ఓ పాట‌తో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభించారు. ఈ పాట‌కు అయిన ఖర్చు అక్ష‌రాలా మూడున్న‌ర కోట్ల రూపాయ‌ల‌ట‌. ఈ పాట‌ని గ్రాండాతి గ్రాండ్ గా తీర్చిదిద్దార‌ని, కేవ‌లం సెట్ల‌కే కోటి రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు అయ్యింద‌ని, దాదాపు ప‌ది రోజుల పాటు ఈ పాట‌ని తెర‌కెక్కించాల్సివ‌చ్చింద‌ని స‌మాచారం.

ఈ పాట చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న‌ప్పుడు షారుఖ్ ఖాన్ కూడా సెట్‌కి వెళ్లి మ‌హేష్‌ని ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పాట‌లో చూపిస్తున్న గ్రాండిటి చూసి షారుఖ్ కూడా ఆశ్చ‌ర్య‌పోయాడ‌ట‌. ఓ పాట కోసం మూడున్న‌ర కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డం అంటే మాట‌లా మారి..?? పాట‌కే ఇంత ఖ‌ర్చు చేశారంటే... సినిమా ఎంత‌లో తీస్తారో మ‌రి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.