English | Telugu

బోయపాటికి బంఫర్ ఆఫర్ ఇచ్చిన బెల్లంకొండ..!

గతంలో భద్ర, తులసి, దమ్ము లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి..బాలకృష్ణతో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్ని తీసిన బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. బాలయ్య బాబుకి తన కెరియర్‌లోనే మంచి హిట్ చిత్రాల్ని అందించిన బోయపాటిని తన కుమారుడి రెండవ చిత్రానికి దర్శకత్వం వహించాల్సిందిగా నిర్మాత బెల్లంకొండ సురేష్ కోరాడని సమాచారం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు గాను బోయపాటికి రూ. 7 కోట్ల వరకూ పారితోషకం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ నెల 27న సినిమా ప్రారంభం కాబోతోంది. భారీ బడ్జెట్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా రూపొందించనున్నారు. హీరోయిన్, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు శీను' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద విజయాన్ని నమోదు చేసింది. వివి వినాయక్ దర్శకత్వం వహించారు. సమంత హీరోయిన్‌గా నటించింది. 'అల్లుడు శ్రీను' చిత్రం ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఇప్పటి వరకు రూ. 40 కోట్లు వసూలు చేసింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.