English | Telugu

లెజెండ్‌ డైరెక్టర్ బోయపాటి స్పెషల్‌ ఇంటర్వ్యూ

నటసింహ నందమూరి బాలకృష్ణతో సింహా, లెజెండ్‌ వరుస సినిమాలతో రెండు బ్లాక్‌బస్టర్‌ సినిమాలు చేసిన దర్శకుడు బోయపాటి శీను. రెండు సినిమాలు 175 డేస్‌ వేడుకను జరుపుకోవడం విశేషం. బాలకృష్ణ వంటి హీరోతో ఏ దర్శకుడైనా హిట్‌ సినిమానే చేయాలనుకుంటాడు. నేను కూడా అదే చేశాను. ఆయన ఒక పరిపూర్ణ నటుడు. ఆయన్ని ఎలా కావాలంటే మనం అలా మలుచుకోవచ్చు. ఆయన ఎన్ని రకాలు పాత్రలు చేసినా ఆయనలో మరో కోణం మిగిలే ఉంటుంది అని అంటున్నారు దర్శకుడు బోయపాటి శీను. సింహా, లెజెండ్‌ రెండు వరుస సినిమాలతో సిల్వర్‌ జూబ్లీ విజయాలు దక్కించుకున్న ఈ దర్శకుడితో స్పెషల్‌ ఇంటర్వ్యూ...

హిట్‌ సినిమా చేయాలనేదే ఆలోచన...

100డేస్‌ 31 సెంటర్స్‌, ఈరోజుతో 175డేస్‌ వేడుకను విజయవంతంగా జరుపుకుంటుంది. సినిమా హిట్‌ కన్‌ఫర్మ్‌. ఏ దర్శకుడైనా బాలకృష్ణ వంటి హీరోతో హిట్‌ సినిమా చేయాలనే ఆలోచిస్తారు. అదేవిధంగా నేను కూడా సింహా తర్వాత హిట్‌ సినిమా చేయాలనే ఆలోచనతోనే ఈసినిమాని చేశాను.

అది బాలయ్య నమ్మకం..

సినిమాలు 50రోజులు ఆడటం కష్టమైన ఈరోజుల్లో బాలకృష్ణగారితో నేను చేసిన రెండు సినిమాలు 175డేస్‌ ఆడటం అనేది చాలా ఆనందంగా ఉంది. సింహా తర్వాత మా కాంబినేషన్‌లో సినిమా అంటే ఎక్స్‌పెక్టేషన్స్‌ ఎలా ఉంటాయనేది నాకు తెలుసు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను నేను రీచ్‌ అయ్యానంటే దర్శకుడిగా నన్ను నేను నమ్మడం, దర్శకుడిని బాలకృష్ణగారు నమ్మడం.

ముందే అనుకున్నాం...

మూడు సంవత్సరాల నుండే ఇటువంటి సినిమాతో ముందకు రావాలనే ఆలోచన ఉంది. నేను, బాలయ్యగారు ఎన్నికలు ముందు ఈ సినిమా వచ్చే విధంగా ప్రణాళిక వేసుకున్నాం. ఫ్యామిలీ ఆడియెన్స్‌, మాస్‌ ఆడియెన్స్‌ అలా చూసిన ప్రతి ఆడియెన్‌ మెచ్చుకోవాలంటే ఏం చేయాలి. ఏ ఎలిమెంట్స్‌ అవసరం అని ఆలోచించి వాటిని ముందు నుండి క్యారీ చేశాను.

ఆ డిస్టన్స్‌ నేను మెయిటేయిన్‌ చేస్తాను...

బాలకృష్ణగారు చాలా క్లోజ్‌గా మూవ్‌ అవుతారు. కానీ ఆయన సీనియర్‌ ఆర్టిస్ట్‌. ఒక దర్శకుడు, సీనియర్‌ హీరోతో ఓ సినిమాకి సంబంధించి ఎంత వరకు అవసరమో అంతే డిస్టన్స్‌ నేను మెయిటెయిన్‌ చేస్తాను. మేమిద్దరం ఎప్పుడు డిస్కస్‌ చేసినా సినిమా గురించే ఉంటుంది.

బాలకృష్ణగారి ఆదర్‌ యాంగిల్‌..

బాలకృష్ణగారు ఇంతకు ముందు చాలా హిట్‌ సినిమాలు చేసినప్పటికీ అవన్నీ ఒక యాంగిల్‌లో ఉంటాయి. ఆయన నటనలోని మరో యాంగిల్‌ను నేను సింహా, లెజెండ్‌ సినిమాల ద్వారా చూపించాను.

బాలకృష్ణ..పరిపూర్ణ నటుడు..

బాలయ్య పరిపూర్ణ నటుడు. ఆయన దగ్గర నుండి మనకు ఎలా కావాలంటే అలాంటి నటనను రాబట్టుకోవచ్చు. కాకుంటే ఒక ఐడియా ప్రకారం ముందుకు వస్తే అనుకున్నది ఫలితాన్ని రాబట్టుకోవచ్చు.

జగపతిబాబును విలన్‌గా తీసుకోవడమే విభిన్నమైన ఆలోచన...

బాలయ్య వంటి హీరోకి ఎదురు నిలబడాలంటే విలన్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలి. అందుకని కొత్తవాళ్లని విలన్‌గా తీసుకోవాలని ఆలోచించాను. అలా కొత్త విలన్స్‌ని తీసుకోవాలని ఆలోచనలో ఉన్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన జగపతిబాబుగారిని విలన్‌గా తీసుకోవడం. సింహాలో కొత్త విలన్స్‌ను ఇంట్రడ్యూస్‌ చేశాను. బాలకృష్ణగారితో సినిమా చేయడం ఒక ఎత్తు. ఇందులో జగపతిబాబుగారిని విలన్‌గా తీసుకోవడం మరో ఎత్తు. వంద సినిమాలు ఫ్యామిలీ హీరోగా చేసిన హీరోను విలన్‌గా చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఎంత కేర్‌ తీసుకుని ఉంటానో, ఎంత ఆలోచించి ఉంటానో నాకు తెలుసు. చాలా మంది ఈ విషయాన్ని నాకు చెప్పారు. అయితే దర్శకుడిగా ఒక విజన్‌ నాకు ఉంది. ఆ విజన్‌ ప్రకారం నేను ఆయనకి కథ చెప్పి ఒప్పించాను.

అదే మార్గం...

ఇప్పుడు బడ్జెట్‌ పెరిగిపోయింది. పైరసీ సమస్య మరో వైపు. వీటన్నింటిని తట్టుకోవాలంటే సినిమాని ఎక్కువ థియేటర్స్‌లో విడుదల చేయాల్సి వస్తోంది.

ప్రేమకథ చేస్తున్నాను..

బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఇప్పుడు ప్రేమకథ చేస్తున్నాను. ఈ సినిమాలో తన ప్రతి విషయంలో కొద్దిగా డిఫరెంట్‌గా ఉండాలని అందుకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాను.

కథ ముఖ్యం.. సంఖ్యతో నాకు పనిలేదు..

బాలయ్యతో వందో సినిమా చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. కాకుంటే కథ ఇంకా అనుకోలేదు. మంచి కథ మైండ్‌లోకి రాగానే ఆయనతో నేను సినిమా చేస్తాను. ఇక్కడ నెంబర్‌ గురించి ఆలోచించడం లేదు. ఆయనతో సినిమా చేయడానికి నేను సిద్ధమే.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.