English | Telugu
కత్తి కోసం... చిరు సంచలన నిర్ణయం
Updated : Feb 3, 2016
సుదీర్ఘ విరామం తరవాత కత్తి రీమేక్ తో తన అభిమానుల్ని అలరించడానికి చిరంజీవి సన్నద్ధం అవుతున్నాడు. కత్తి కథ విషయంలో కొద్ది పాటి సమస్యలు ఉన్నా... వాటిని సామరస్యంగానే పరిష్కరించుకోవాలని చూస్తున్న చిరు... ఈ సినిమాలో అభిమానుల్ని మెప్పించడానికి మాత్రం అతి పెద్ద రిస్క్ తన భుజాన వేసుకొన్నాడన్నది లేటెస్ట్ టాక్. సినిమాల కోసం బరువు తగ్గడానికి గత రెండు నెలలుగా తీవ్రంగా కృషి చేస్తున్న చిరు.. ఆ విషయంలో విఫలం అయ్యాడని టాక్.
ఇప్పుడున్నట్టే బొద్దుగా కనిపిస్తే... బాగోదని చిరు భావిస్తున్నాడు. డాన్సులు చేయడానికి, ఫైట్లు చేయడానికి ఇబ్బంది కలుగుతుందని చిరు భయం. అందుకే.. కృత్రిమంగా బరువు తగ్గేందుకు మెగ్గు చూపుతున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్, విష్ణులాంటి కథానాయకులు కృత్రిమంగా బరువు తగ్గించుకొన్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి విషయంలో కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నార్ట. ఈ వయసులో బరువు తగ్గించుకోవాలని చూస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెబుతున్నారు. అయితే చిరంజీవి మాత్రం... కృత్రిమంగానే బరువు తగ్గాలని చూస్తున్నారట. ఈ విషయంలో వారం రోజుల్లో చిరు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చిరంజీవి ముంబైలో ఉన్నారట. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో భుజానికి సంబంధించిన చిన్నపాటి చికిత్స తీసుకొంటున్నారని తెలుస్తోంది. అక్కడ వైద్యులతోనే బరువు తగ్గడం ఎలా అనే విషయంపై చిరు సంప్రదింపులు జరుపుతున్నారట. ఏదేమైనా చిరంజీవి మాత్రం తన ఫ్యాన్స్ కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధమనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. మరి.. ఏం జరుగుతుందో చూద్దాం.