English | Telugu

Birthmark Review: బర్త్ మార్క్ మూవీ రివ్యూ

Birthmark Review: బర్త్ మార్క్ మూవీ రివ్యూ

 

మూవీ : బర్త్ మార్క్
నటీనటులు: షబ్బీర్ కల్లరక్కల్, మిర్ణ మీనన్, పీఆర్ వరలక్ష్మి, ఇంద్రజిత్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఉదయ్ తంగవేల్
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
ఎడిటింగ్: ఇనియావన్ పాండియన్
దర్శకత్వం: విక్రమ్ శ్రీధరణ్
ఓటీటీ: ఆహా

కథ : 

డేనియల్ (షబ్బీర్) ఆర్మీలో పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య జెన్నిఫర్ (మిర్నా మీనన్) గర్భవతి అవుతుంది. అప్పుడే అతను 'ధవంతరి' బర్తింగ్ విలేజ్' గురించి వింటాడు. ఫారెస్టుకి సమీపంలోని ప్రదేశం అది. అక్కడ ఆమెకి డెలివరీ చేయించాలనే ఉద్దేశంతో తీసుకుని వెళతాడు. ఆ ఆశ్రమం 'కుందవై' (పీఆర్ వరలక్ష్మి) అధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. ఆమె దగ్గర ఆశ .. అమ్ములు అసిస్టెంట్లుగా ఉంటారు. అక్కడ వాచ్ మెన్ గా సెబాస్టియన్ పనిచేస్తూ ఉంటాడు. డేనియల్ అప్పుడప్పుడు చాలా చిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఏదో ఆవహించినట్టుగా ఆవేశపడుతుంటాడు. అతని ధోరణి ఆశ - అమ్ములు - సెబాస్టియన్ కి కూడా అయోమయాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని గురించి జెన్నీ అడిగితే, అతను ఏదో ఒక కారణం చెబుతూ ఉంటాడు. ఒక రోజున అతని డైరీ ఆమె కంట పడుతుంది.  ఆ డైరీని ఆమె చదవడం మొదలుపెడుతుంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ విషయంలో డేనియల్ కి అనుమానాలు ఉన్నాయనే విషయం  ఆమెకి అర్థమవుతుంది. తనను ఏదో దురుద్దేశంతోనే అక్కడికి తీసుకుని వచ్చాడని ఆమె భావిస్తుంది. అప్పుడు జెన్నీ ఏం చేస్తుంది? ఆమెపై డేనియల్ కి ఎందుకు అనుమానం కలుగుతుంది? అంతకుముందు ఏం జరుగుతుంది? సెబాస్టియన్ పై కోపంతో డేనియల్ ఏం చేశాడనేది మిగతా కథ.


విశ్లేషణ: 

సినిమా మొదట భార్యని ప్రేమించే భర్తగా, తనకి ప్రసవం బాగా కావాలని ఉద్దేశంతో ఆ కొండ ప్రాంతానికి తీసుకొచ్చాడనే పాయింట్ తో కథ మొదలవుతుంది. ‌ఇక అక్కడ జరిగే సీక్వెన్స్, డేనియల్ బిహేవియర్ సినిమా చూస్తున్న వారికి అర్థం కాదు. 

ఏదో జరుగుతుందనే ఇంటెన్స్ తో మొదలైనా, ఓసీ మళ్ళీ ఇదేనా అనిపిస్తూ, అసలేముంది అనేంతలా కథనం మారిపోతుంది. భార్యాభర్తల ఎమోషనల్ బాండింగ్ కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ‌ప్రెగ్నెంట్ లేడీస్ కి ఏమైనా మెసెజ్ ఇస్తారంటే అదీ లేదు. వాళ్ళు చూస్తే ఇంకా భయపడతారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మొదట్లో ఓ లిప్ లాక్, క్లైమాక్స్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కాస్త బోల్డ్ సీన్ తప్ప మిగతాదంతా పర్వాలేదు. అసభ్య పదజాలం వాడలేదు.

ఓ ముప్పై అయుదు నిమిషాల షార్ట్ ఫిల్మ్ ని పార్ట్ లు పార్ట్ లుగా విభజించి కాస్త రిపీటెడ్ సీన్లు, అర్థం కానీ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీతో దానిని రెండు గంటల వరకు లాగీ లాగీ ల్యాగ్ చేసి పడేశారు. చివరికి ఏదైనా ఉందా అంటే ఏమీ ఉండదు. ఇప్పటికి మనం చాల సినిమాల్లో చూసిన మామలు సీన్ ని మళ్ళీ మాములుగా చూపించారు బర్త్ మార్క్ దర్శకుడు. ఈ సినిమాలో ఇది బాగుంది అని అనిపించేది ఎక్కడంటే.. మూవీ మొదలైన ఇరవై నిమిషాలు అంతే. మిగతాదంతా డొల్ల. రోటీన్ స్టోరీనీ అంతే రొటీన్ గా సప్పగా సాగదీశారు. ఇది చూసాక ప్రేక్షకుడికి అస్సాంకి బర్త్ కన్ఫమ్ అన్న రేంజ్ లో దర్శకుడు తన మార్క్ కనబరిచాడు. ఉదయ్ తంగవేల్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ బాగుంది. ఇనియావన్ పాండియన్ ఎడిటింగ్ పర్లేదు. నిర్మాణ విలవలు బాగున్నాయి. 

నటీనటుల పనితీరు:

డేనియల్ గా షబ్బీర్, జెన్నిఫర్ గా మిర్నా మీనన్ ఆకట్టుకున్నారు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

ఫైనల్ గా : ఏ మాత్రం ఆసక్తికరంగా లేని కథనం. ఎక్కడ లేనీ సాగదీత.

రేటింగ్: 2 / 5

✍️. దాసరి మల్లేశ్