English | Telugu

‘సింబా’ మూవీ రివ్యూ

‘సింబా’ మూవీ రివ్యూ

 

సినిమా పేరు: సింబ
తారాగణం: జగపతి బాబు, కస్తూరి, గౌతమి, అనసూయ, దివి వైద్య, శ్రీనాథ్ మాగంటి, వశిష్ట ఎన్ సింహ, కబీర్ దుహన్ సింగ్ తదితరులు  
సంగీతం: కృష్ణ సౌరభ్   
సినిమాటోగ్రఫీ: కృష్ణ ప్రసాద్
ఎడిటర్: తమ్మిరాజు 
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సంపత్ నంది
 దర్శకత్వం: మురళి మనోహర్ రెడ్డి 
నిర్మాత: సంపత్ నంది, రాజేందర్ రెడ్డి 
బ్యానర్: సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ 
విడుదల తేదీ: అగస్ట్ 9, 2024 

 

కథ 
పురుషోత్తం రెడ్డి (జగపతి బాబు) ఫారెస్ట్ ఆఫీసర్ గా వర్క్  చేస్తుంటాడు. చెట్లు లేనిదే భవిష్యత్తులో మానవాళికి ప్రమాదం అనేది ఆయన ప్రధాన నమ్మకం.పైగా  అసాంఘిక శక్తుల నుంచి వాటిని కాపాడుతూ అందుకు అడ్డొచ్చిన వాళ్ళని చంపుతుంటాడు.తన వంతుగా కొన్ని లక్షల చెట్లని పెంచుతు హైదరాబాద్ నగరంలో ఒక అడవినే సృష్టిస్తాడు. ఇక అక్ష (అనసూయ) స్కూల్ టీచర్ గా పని చేస్తు ఉత్తమ టీచర్ గా ఎన్నో అవార్డుల్ని గెలుచుకుంటుంది. తన భర్త, కూతురు తో కలిసి అందరితో ప్రేమగా ఉంటు  ఉంటుంది. ఇంకో పక్క ఫాజిల్ (శ్రీనాధ్ ) ఒక ఛానల్ లో ఇన్విస్టిగేషన్ జర్నలిస్ట్ గా పని చేస్తుంటాడు.ఇష్ట (దివి ) ప్రేమ కోసం పరితపిస్తుంటాడు.  అలాగే  ఇరానీ (అనీష్ కురువిళ్ళ) ఒక ఫేమస్  డాక్టర్.  చావు బతుకుల్లో ఉన్న వాళ్లని కాపాడటంలో  స్పెషలిస్ట్. ఈ  ముగ్గురుకి ఎలాంటి సంబంధం లేదు. అలాంటిది ప్రముఖ పారిశ్రామిక  వేత్త పార్థ (కబీర్ సింగ్) మనుషులని అత్యంత దారుణంగా చంపుతుంటారు. వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు? పోలీసులు వాళ్ళని ఎలా కనిపెట్టారు?  పాండురంగ రెడ్డి కి ఆ ముగ్గురికి ఏమైనా సంబంధం అనేదే ఈ కథ  

ఎనాలసిస్ :

ఒక మంచి సినిమాకి ఇంతకంటే కథ అవసరం లేదు. కానీ చెప్పే విధంలోనే రాంగ్ రూట్ లోకి మళ్లింది. ఇటీవల విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన మహారాజా మూవీ స్క్రీన్ ప్లే ని ఈ మూవీకి యూజ్ చేసుంటే సినిమా హిట్ అయ్యేది. అంటే గతంలో జరిగింది. ప్రస్తుతం జరిగేది ఒకే మోడ్ లో చెప్పుండాల్సింది. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే ఒక సాధారణ గృహిణిలా టీచర్ గా  అనసూయ  ఇంట్రడక్షన్ బాగుంది. పైగా భర్తని హ్యాండీ క్యాప్ గా చూపించి క్యూరియాసిటీ ని కూడా కలిగించారు.ఇక .ఆమె ఎవర్ని అయితే చంపాలనుకుంటుందో వాళ్ళ కోసం వెతికితే బాగుండేది. ఇందుకు అవకాశం ఉండి కూడా మేకర్స్ ఆ దిశగా చూపించలేకపోయారు.  ఇదే సూత్రం ఫాజల్ అండ్ డాక్టర్  ఇరానీ  క్యారెక్టర్స్ కి కూడా వర్తిస్తుంది. కాకపోతే  ఫాజల్, ఇష్ట (దివి ) క్యారెక్టర్స్ కి మద్య లవ్ ట్రాక్ అయితే అదిరింది.ఇక  పోలీసుల ఇన్విస్టిగేషన్ మాత్రం చాలా సిల్లీగా ఉంది. స్పెషల్ ఆఫీసర్ అని  సి సి కెమెరా ద్వారా నేరస్తుల్ని పట్టుకోవడం ఏంటో విచిత్రంగా ఉంటుంది. సినిమా చివరి వరకు ఇదే సూత్రాన్ని కంటిన్యూ చేసారు. ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే జగపతి బాబు క్యారెక్టర్ ఎంటర్ అవ్వగానే  సినిమాకి ఒక ఊపు వచ్చింది. ఆయన  ఉన్నంత సేపు కథ కూడా చాలా వేగంగా సాగింది.పైగా పోలీసు ఆఫీసర్  హంతుకుల కోసం వెతుకుతుంటే హంతుకుడే  పోలీసులని తన ఇంటికి  ఇన్వైట్ చేసి నేనే చంపానని ఆ కథ  చెప్పడం చాలా కొత్తగా ఉండి అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది. లాస్ట్ లో చాలా సింపుల్ గా తేల్చిపడేసారు.  ఓల్డ్ ఫార్మేట్ లో కథనాలు సాగటం సింబా కి  ప్రధాన  మైనస్. అలాంటి సీన్స్ ని  ప్రేక్షకులు ఎప్పుడో చూసేసారు. ఇక సైకియాట్రిస్ట్  గా చేసిన  గౌతమి పోలీసులకి డైరెక్షన్ ఇవ్వడం విచిత్రంగా అనిపిస్తుంది. 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు

జగపతిబాబు ఎప్పటి లాగే సూపర్ గా చేసాడు.  పురుషోత్తం రెడ్డి క్యారక్టర్ మాత్రమే  ప్రేక్షకులకి కనపడేలా చెయ్యడంలో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు.అనసూయ,అనీష్ కురువిళ్ళ, శ్రీనాధ్ లు కూడా బాగానే చేసారు. స్పెషల్ ఆఫీసర్ అనురాగ్ క్యారెక్టర్ లో వశిష్ట నటనని మంచి మార్కులే పడతాయి. ఇక గౌతమి నటన గురించి పెద్దగా చెపుకోవాల్సిన పని లేదు.ఇష్ట క్యారక్టర్ చేసిన దివి కూడా  మంచి నటనే ప్రదర్శించింది. మురళి మనోహర్ రెడ్డి దర్శకత్వం బాగానే ఉన్నా కూడా కథనంలో ఇంట్రెస్టింగ్  గ్రిప్ లేకపోవడంతో తేలిపోయింది. ఇక సంపత్ నంది ప్రతిభ డైలాగ్స్  వరకు మాత్రమే  ఉపయోగపడింది. ఆర్ ఆర్ చాలా చాలా బాగుంది.  ఫొటోగ్రఫీ కూడా పర్లేదనిపించే స్థాయిలోనే ఉంది. నిర్మాణ విలువలు  గురించి కూడా పెద్దగా చెప్పుకోవలసిన పని లేదు.

ఫైనల్ గా చెప్పుకోవాలంటే కథనంలో వేగం చూపించే బదులుగా క్యారెక్టర్స్ లో చూపించారు. జగపతి బాబు, ఆయన ఆశయం తప్ప సినిమాలో ఏం లేదు.    


 రేటింగ్  2 / 5                                                                                                                                                                                                                                                                         అరుణాచలం