English | Telugu
‘పోకిరి’కి, ‘డబుల్ ఇస్మార్ట్’కి వున్న లింక్ అదే.. పక్కా హిట్ రిపోర్ట్!
Updated : Aug 8, 2024
రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్ట్ 15న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేసేందుకు రెడీ అయ్యారీ జంట. ఇటీవల ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాకి సంబంధించిన సెన్సార్ రిపోర్ట్‌తో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సాధారణంగా సినిమా బాగుందనే రిపోర్ట్ ఇస్తుంటారు. ఈ సినిమా విషయంలో మాత్రం ఓ కొత్త విషయాన్ని బయటపెట్టారని తెలుస్తోంది.
మహేష్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ క్లైమాక్స్‌లో పూరి ఇచ్చిన ట్విస్ట్. ఆ ట్విస్ట్‌కి ప్రేక్షకులు థ్రిల్ అయిపోయారు. అప్పటివరకు పోకిరిగా కనిపించే హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అనే విషయాన్ని రివీల్ చెయ్యడంతో ఒక్కసారిగా సినిమా లుక్ మారిపోయింది. ‘పోకిరి’ చిత్రాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఆ తర్వాత చాలా మంది డైరెక్టర్ అలాంటి ట్విస్టులు ఇచ్చి సక్సెస్ కూడా అయ్యారు. చాలా కాలం తర్వాత అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో పూరి వస్తున్నాడనేది సెన్సార్ నుంచి వచ్చిన రిపోర్ట్. ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలో కూడా ఎవరూ ఊహించని ఓ ట్విస్ట్ ఉంటుందని రివీల్ అయింది. దీంతో పూరికి మరో బ్లాక్‌బస్టర్ రావడం ఖాయమని అతని అభిమానులు చెబుతున్నారు. మరి ఆ ట్విస్ట్ ఏమిటో తెలియాలంటే ఆగస్ట్ 15 వరకు ఆగాల్సిందే.
