English | Telugu

‘భమ్‌ బోలేనాథ్‌’లు బయటకొచ్చారు

నవదీప్‌, నవీన్‌చంద్ర హీరోలుగా ఆర్‌.సి.సి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కార్తీక్‌వర్మ దండు దర్శకత్వంలో శిరువూరి రాజేష్‌వర్మ నిర్మిస్తున్న క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ‘భమ్‌ బోలేనాథ్‌’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ లాంచ్‌ బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ‘కార్తికేయ’ చిత్ర దర్శకుడు చందు మొండేటి ఫస్ట్‌లుక్‌ను లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోలు నవదీప్‌, నవీన్‌చంద్ర, దర్శకుడు కార్తీక్‌వర్మ దండు, నిర్మాత శిరువూరి రాజేష్‌వర్మ, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌, నటులు ప్రదీప్‌, ప్రవీణ్‌, నవీన్‌, చిత్ర సమర్పకుడు శ్రీకాంత్‌ దంతులూరి, కో`ప్రొడ్యూసర్స్‌ కాకర్లపూడి రామకృష్ణ, యాడ్లపల్లి తేజ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చందు మొండేటి మాట్లాడుతూ - ‘‘మా ‘కార్తికేయ’ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించిన రాజేష్‌వర్మగారు, స్క్రీన్‌ప్లే అందించిన కార్తీక్‌వర్మ ఆ సినిమా బాగా రావడానికి ఎంతో హెల్ప్‌ చేశారు. వారిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా ‘కార్తికేయ’లాగే పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

హీరో నవీన్‌ చంద్ర మాట్లాడుతూ - ‘‘నాకు ఇలాంటి మంచి స్క్రిప్ట్‌తో సినిమా వస్తుందని అనుకోలేదు. అందరం ఎంతో హ్యాపీగా ఈ సినిమాని పూర్తి చేశాం. ఈ సినిమాకి పనిచేసిన వారంతా యూతే. ఎంతో ఇష్టపడి, కాస్త కష్టపడి చేశాం. మంచి రిజల్ట్‌ వస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు.

హీరో నవదీప్‌ మాట్లాడుతూ - ‘‘ఇలాంటి స్క్రీన్‌ప్లేతో, ఇలాంటి క్లైమాక్స్‌తో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఇందులో చాలా డిఫరెంట్‌ ఎలిమెంట్స్‌ వున్నాయి. రషెస్‌ చూసిన తర్వాత మేం ఎంతో శాటిస్‌ఫై అయ్యాం’’ అన్నారు.

దర్శకుడు కార్తీక్‌వర్మ మాట్లాడుతూ - ‘‘కార్తికేయ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించాను. చందువల్లే నేను ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాను. కార్తికేయ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌లో వుండగానే నేను చెప్పిన కథను నమ్మి రాజేష్‌గారు నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఆయన నామీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను. ఇదొక క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌. అందరి సపోర్ట్‌తో సినిమా బాగా వచ్చింది’’ అన్నారు.

నిర్మాత శిరువూరి రాజేష్‌వర్మ మాట్లాడుతూ - ‘‘ఇది నా రెండో సినిమా. అందరి కోఆపరేషన్‌తో షూటింగ్‌ హ్యాపీగా కంప్లీట్‌ చేశాం. ఈ నెలాఖరుకు రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం. కార్తీక్‌ చెప్పిన కథను హండ్రెడ్‌ పర్సెంట్‌ స్క్రీన్‌ మీద చూపించాడు. డిఫరెంట్‌ ఎలిమెంట్‌ను టచ్‌ చేస్తూ చేసిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందన్న నమ్మకం నాకు వుంది’’ అన్నారు.

సంగీత దర్శకుడు సాయికార్తీక్‌ మాట్లాడుతూ - ‘‘ఇలాంటి టీమ్‌తో వర్క్‌ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. పాటలు బాగా వచ్చాయి. నెక్స్‌ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగా చేస్తాను. తప్పకుండా ఇది ఓ మంచి సినిమా అవుతుంది’’ అన్నారు.

నటుడు ప్రదీప్‌ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమాకి అందరం ఎమోషనల్‌గా ఎటాచ్‌ అయ్యాం. చాలా షార్ట్‌ టైమ్‌లో బిగ్‌ సినిమా చేశాం. గ్యారెంటీగా మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

నవదీప్‌, నవీన్‌చంద్ర, పూజ రావేరి, ప్రదీప్‌, పోసాని, పంకజ్‌ కేసరి, ప్రాచి, శ్రేయ, కిరీటి, ప్రవీణ్‌, నవీన్‌, తాగుబోతు రమేష్‌, ధన్‌రాజ్‌, పృథ్వీ, కాదంబరి కిరణ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: భరణి కె. ధరణ్‌, మాటలు: శరణ్‌ కొప్పిశెట్టి, కార్తీక్‌వర్మ దండు, డాన్స్‌: విజయ్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రఘు పెన్మెత్స, కో-ప్రొడ్యూసర్స్‌: కాకర్లపూడి రామకృష్ణ, యాడ్లపల్లి తేజ, సమర్పణ: శ్రీకాంత్‌ దంతులూరి, నిర్మాత: శిరువూరి రాజేష్‌వర్మ, కథ-కథనం-దర్శకత్వం: కార్తీక్‌వర్మ దండు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.