English | Telugu

భలే భలే గా దూసుకెళ్తున్న మగాడు

నాని ‘భలే భలే మగాడివోయ్’ రెండో వారంలో కూడా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. మొదటి వారంలో బ్లాక్ బ్లాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా..ఇప్పుడు ఆ రెంజుని కూడా దాటి పోయింది. ‘భలే భలే మగాడివోయ్’ రెండో వారం పూర్తయ్యేసరికి రూ.21.6 కోట్ల షేర్ రాబట్టడం విశేషం.

ఏరియాల వారీగా బ్రేకప్స్ చూస్తే.. నైజాంలో షేర్ రూ.5.85 కోట్లు. రాయలసీమ (సీడెడ్)లో రూ.1.53 కోట్ల షేర్ కలెక్టయింది. ఆంధ్రాలో రూ.5.82 కోట్ల షేర్ వసూలైంది. వైజాగ్ లో రూ.1.55 కోట్లు - తూర్పు గోదావరిలో రూ.91 లక్షలు - పశ్చిమ గోదావరిలో రూ.75 లక్షలు - కృష్ణాలో రూ.కోటి - గుంటూరులో రూ.1.28 కోట్లు - నెల్లూరులో రూ.33 లక్షల షేర్ వచ్చింది. ఏపీ తెలంగాణ కలిపి షేర్ రూ.13.2 కోట్లు షేర్ రాబట్టింది.

కర్ణాటకలోనూ నాని సినిమా అదరగొట్టింది. అక్కడ షేర్ రూ.2.23 కోట్లు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన వసూళ్లు అమెరికాలో వచ్చాయి. ఇప్పటిదాకా అక్కడ ‘భలే భలే మగాడివోయ్’ రూ.8.42 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. షేర్ రూ.5.47 కోట్లు. మొత్తంగా రెండు వారాల్లో ఈ సినిమా రూ.21.6 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ రేంజిని దాటిపోయింది.